SBI News: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తెలుసుకోండి
SBI Loans: భారతదేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వు బ్యాంక్ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంక్ తన వ్యాపారంలో అనేక మార్పులకు ఎప్పటికప్పుడు శ్రీకారం చుడుతుందని మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ వివిధ పదవీకాలానికి సంబంధించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను(MCLR) 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచబడిన కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ని పెంచడం ఇది వరుసగా మూడో నెల కావటం గమనార్హం.

మారిన రేట్లను పరిశీలిస్తే.. మూడు సంవత్సరాల కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త MCLR రేటు గతంలో ఉన్న 9% నుంచి 9.10%కి పెంచబడింది. ఇక ఇతర కాలాలకు పెరిగిన వడ్డీ రేట్లను పరిశీలిస్తే..
ఓవర్ నైట్ కాలానికి: 8.10% నుంచి 8.20%కి పెంపు
ఒక నెల కాలానికి: 8.35% నుంచి 8.45%కి పెరిగింది
మూడు నెలల కాలానికి: 8.40% నుంచి 8.50% పెంచబడింది
ఆరు నెలల కాలానికి: 8.75% నుంచి 8.85% పెంపు
ఏడాది కాలానికి: 8.85% నుంచి 8.95% పెంపు
రెండేళ్ల కాలానికి: 8.95% నుంచి 9.05%కి పెంపు
మూడు సంవత్సరాల కాలానికి: 9.00% నుంచి 9.10% పెరిగింది
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ జూన్ 2024 నుంచి నిర్దిష్ట కాలాల్లో MCLRని 30 బేసిస్ పాయింట్లు మేర క్రమంగా పెంచింది. MCLR రేటు పెంపుదల అంటే గృహ రుణం, కారు రుణం, విద్యా రుణాల వడ్డీ రేట్లు పెరగటం వల్ల వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది. మునుపటి బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో రుణ రేట్లకు బెంచ్‌మార్క్‌గా ఏప్రిల్ 2016లో MCLRని RBI ప్రవేశపెట్టింది. దీనివల్ల రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా రుణ రేట్లలో మార్పులు వస్తుంటాయి.


Click it and Unblock the Notifications