కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఇస్తున్నాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇంటి నుండి పని విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. కరోనా నేపథ్యంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎక్కడి నుండైనా పని చేయడానికి (వర్క్ ఫ్రమ్ ఎనీవేర్) సిద్ధముతోంది. డిజిటల్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడంతో పాటు ప్రస్తుత సమయంలో రిస్క్ ఎంత అనేదానిపై, వ్యాపార ప్రక్రియపై పునఃసమీక్షించడంపై దృష్టి సారించినట్లు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది.

మారటోరియం 21.8 శాతం కస్టమర్లు మాత్రమే
వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఎక్కడి నుండైనా పని చేసేందుకు సాంకేతికతను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల కస్టమర్లపై కరోనా ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. దీని వల్ల సంస్థలు కూడా తీవ్ర ఇక్కట్లలో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం కేవలం 21.8 శాతం మంది కస్టమర్లు మాత్రమే మారటోరియం ప్రయోజనాన్ని అందిపుచ్చుకుంటున్నారని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో 98 శాతం బ్యాంకు ఆపరేటబులిటీతో 91 శాతం ప్రత్యామ్నాయ పద్ధతిలో నిర్వహించామన్నారు.

టెక్నాలజీ, ఉత్పత్తి సాధనాలు
కరోనా నేపథ్యంలో కలిగే అంతరాయాన్ని తగ్గించేందుకు బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ (BCP) ఉందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్లకు సేవలు అందించేందుకు బిజినెస్ కంటిన్యుటీ హబ్ బ్రాంచీలు గుర్తించామని, అవసరమైన బ్యాకెండ్ సపోర్ట్‌ను కూడా గుర్తించినట్లు తెలిపింది. రిమోట్ వర్కింగ్ కోసం ఉత్పత్తి సాధనాలు, సాంకేతికత అందుబాటులో ఉందని తెలిపింది.

ఎక్కడి నుండైనా పని వల్ల ప్రయోజనం
వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (ఎక్కడి నుండైనా పని-WFA) వల్ల ప్రయాణ సమయం కూడా ఉద్యోగులకు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోందని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటికే 19 ఫారన్ కార్యాలయాల్లో WFA ప్రారంభించామని, త్వరలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇది బ్యాంకు ఆపరేషనల్ ఖర్చును తగ్గిస్తుందని, సిబ్బందికి కూడా ఉత్సాహంగా ఉంటుందని, ఉత్పాదక పెరుగుతుందని అభిప్రాయపడింది.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
కరోనాకు ప్రత్యామ్నాంగా బ్యాంకులు డిటిజల్ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, రుణదాతలకు డిజిటల్ మాద్యమాల ద్వారా సేవలు అందించడాన్ని మరింత పెంపొందించాలని పేర్కొంది. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు బ్యాంకు వ్యాపారానికి, ఎకానమీకి క్లిష్ట పరిస్థితులేనని అభిప్రాయపడింది. కొత్త ఆపరేటింగ్ విధానానికి అనుగుణంగా వివిధ అంశాలను బ్యాంకింగ్ వ్యవస్థ పునఃసమీక్షించవలసి ఉంటుందని తెలిపింది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ.14,488.11 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19లో ఇది రూ.862.23 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications