2000 Notes: భారతీయ రిజర్వు బ్యాంక్ దేశంలో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో నోట్లు కలిగి ఉన్న అనేక మంది వాటిని మార్చుకునేందుకు ఉన్న మార్గాల గురించి అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్లను మార్చుకునేందుకు సదవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం మీరు స్టేట్ బ్యాంక్ ఖాతాదారుడు కాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ సదవకాశం నోట్లను మార్చుకోవటం సులభతరం చేయనుందని తెలుస్తోంది.

ఒక వ్యక్తి రోజుకు గరిష్ఠంగా రూ.20,000 వరకు విలువవైన రెండు వేల నోట్లను మార్చుకునేందుకు పరిమితిగా ఉంది. ఎటువంటి ఫారమ్‌లు లేదా గుర్తింపు పత్రాలు అవసరం లేకుండానే తమ బ్యాంకు బ్రాంచ్ లలో నోట్లను ప్రజలు ఉచితంగా మార్చుకోవచ్చని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇందుకోసం మే 23, 2023 నుంచి RBI బ్యాంక్ శాఖలు లేదా రీజినల్ ఆఫీసులను సంప్రదించాలని ప్రజలను కోరింది.
సాధారణ బ్యాంకింగ్ పద్ధతి ప్రకారం రూ.2000 నోట్ల డిపాజిట్ కొనసాగించవచ్చని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే అధీకృత RBI కార్యాలయాలు లేదా బ్యాంక్ శాఖలలో నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబర్ 30, 2023 వరకు సమయం ఉంది. మే 19, 2023న క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications