SBI Loan: పండుగకు చాలా మంది భారతీయులు కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది.
దేశంలో పండుగల సీజన్ క్యాష్ చేసుకునేందుకు కారు, గృహ రుణాలపై ఎస్బీఐ మంచి ఆఫర్లను అందిస్తోంది. ముందుగా కార్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజును సున్నా రూపాయిలుగా ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫర్ కింద జనవరి 31, 2024 వరకు ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది. ఆటో లోన్‌లు తక్కువ వడ్డీ రేట్లకు తక్షణ సూత్రప్రాయ ఆమోదంతో 100 శాతం వరకు ఫైనాన్సింగ్ అందిస్తోంది. వివిధ వాహన కంపెనీలకు ప్రత్యేక ఆఫర్లను సైతం స్టేట్ బ్యాంక్ అందుబాటులో ఉంచింది.

ఇదే సమయంలో గృహ రుణాలు పొందేవారికి ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. SBI గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు రుణ వడ్డీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్రత్యేక తగ్గింపు డిసెంబర్ 31, 2023 వరకు వర్తిస్తుందని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రుణం పొందాలనుకుంటున్న వ్యక్తి CIBIL స్కోర్‌తో ముడిపడి ఉంటుందని బ్యాంక్ ప్రకటించింది. అంటే అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. అలాగే 700 పాయింట్ల కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ కలిగిన వ్యక్తులు అదనంగా 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీని పొందవచ్చని బ్యాంక్ ప్రకటించింది. బిల్డర్లతో అనుసంధానించబడిన ప్రాజెక్ట్‌లు కూడా అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ అందుబాటులో ఉంది.
అలాగే పండుగ సమయంలో స్టేట్ బ్యాంక్ తన డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు సైతం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు అనేక షాపింగ్ సైట్లలో 10 శాతం వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications