State Bank of India: దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలో అగ్రగామి బ్యాంకింగ్ సంస్థగా ఎదిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా స్టేట్ బ్యాంక్ వివిధ కాలాల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR) రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ 0.1 శాతం బ్యాంక్ పెంచటంతో MCLR లింక్డ్ లోన్స్ తీసుకోవడం ఖరీదైనదిగా మారింది. దీనికి తోడు ఇప్పటికే బ్యాంక్ నుంచి ఈ కేటగిరీకి సంబంధించి రుణాలను పొందిన వ్యక్తులు ప్రతినెల చెల్లించే EMI మెుత్తం మునుపటి కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉండనుంది. దీంతో ప్రధానంగా హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి దీర్ఘకాలిక రుణాలను పొందిన వ్యక్తుల జేబులకు చిల్లుపడనుంది.

తాజా పెంపు తర్వాత ఒక సంవత్సరం MCLR 8.65% నుంచి 8.75%కి పెరిగింది. అదే సమయంలో ఒక నెల, మూడు నెలల MCLR 8.20% నుంచి 8.30%కి పెరిగింది. ఆరు నెలల MCLR ఇప్పుడు 8.55% నుంచి 8.65%కి పెరిగింది. అదనంగా రెండేళ్ల MCLR 8.75% నుండి 8.85%కి పెరిగింది. మూడేళ్ల MCLR ఇప్పుడు 8.85% నుంచి 8.95%కి పెరిగింది. గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఒక సంవత్సరం MCLR రేటుతో అనుసంధానించబడి ఉన్నాయి.అక్టోబర్ 2019 నుంచి ద్రవ్య విధాన ప్రసారాన్ని మెరుగుపరచడానికి SBIతో సహా బ్యాంకులు ఈ బాహ్య ప్రమాణాలకు కొత్త రుణాలను అనుసంధానించవలసి ఉంటుంది.
SBI తన వ్యాపారాన్ని విస్తరించడానికి బాండ్ల ద్వారా 100 మిలియన్ డాలర్లు లేదా రూ.830 కోట్లను సమీకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సీనియర్ అన్ సెక్యూర్డ్ ఫ్లోటింగ్ రేట్ డిబెంచర్ల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో ఎస్బీఐ పేర్కొంది. దీని మెచ్యూరిటీ వ్యవధి మూడేళ్లుగా ఉంది. ఈ బాండ్లను జూన్ 20, 2024 వరకు లండన్ బ్రాంచ్ ద్వారా జారీ చేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.


Click it and Unblock the Notifications