SBI News: రికార్డుల మోతమోగిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. స్టాక్స్ ఉన్నోళ్లకి పండగే..
SBI Mcap: ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క భారతీయుడి సంస్థగా చెబుతుంటారు. అయితే ఈ కంపెనీ షేర్లను నమ్ముకున్నోళ్లు మాత్రం నిజంగా బాగుపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ర్యాలీలో పాల్గొన్న కంపెనీ షేర్లు సరికొత్త రికార్డును సృష్టించి.. నిపుణులకు సైతం మైండ్ పోగొడుతోంది.
వాస్తవానికి అందరి అంచనాలకు మించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లలో నేడు భారీ పెరుగుదల కనిపించింది. ఎస్‌బీఐ షేర్లు సోమవారం 9 శాతానికి పైగా పెరిగి రూ.912.10కి చేరాయి. ప్రభుత్వ బ్యాంక్ షేర్లు సోమవారం సరికొత్త రికార్డు సృష్టించాయి. దీంతో ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది మార్చి 7న ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. 2024 ప్రారంభం నుంచి ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.3 లక్షల కోట్లకు పైగా గతం కంటే వృద్ధి చెందింది.

గడచిన 4 ఏళ్లలో SBI షేర్లు 383% కంటే ఎక్కువ పెరిగాయి. జూన్ 5, 2020న స్టేట్ బ్యాంక్ షేర్ ధర రూ.187.80 వద్ద ఉండగా.. జూన్ 3, 2024న అది రూ.912.10కి చేరుకుంది. అలాగే గత 3 సంవత్సరాల్లో స్టేట్ బ్యాంక్ షేర్లు తమ పెట్టుబడిదారులకు ఏకంగా 110% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. జూన్ 4, 2021న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కో షేరు ధర రూ.433.60 వద్ద ఉండగా.. జూన్ 3, 2024న రూ.912.10కి చేరుకున్నాయి. ఇక గడచిన రెండేళ్లలో బ్యాంక్ షేర్లు దాదాపు 100% పెరిగిన సంగతి తెలిసిందే.
గత ఏడాదిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 55% కంటే ఎక్కువ పెరిగాయి. జూన్ 5, 2023న SBI షేర్లు రూ.587 వద్ద ఉండగా అవి ప్రస్తుతం రూ.912.10కి చేరుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు బ్యాంకు షేర్లు దాదాపు 43% పెరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 1, 2024న బ్యాంక్ షేర్లు రూ.641.95 వద్ద ఉన్నాయి. గత 6 నెలల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు దాదాపు 55% పెరిగాయి. డిసెంబర్ 4, 2023న బ్యాంక్ షేర్లు రూ.594.65 వద్ద ఉన్నాయి. నేడు ఎన్నికల ఫలితాలకు కేవలం ఒక్కరోజు ముందు జరిగిన మార్కెట్ బుల్ ర్యాలీలో పాల్గొన్న బ్యాంక్ స్టాక్ ధర రూ.900 మార్కును ఇదిగమించి పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications