ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు షాకిచ్చింది. హోమ్ లోన్స్ పైన కనీస వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.70 శాతం వడ్డీ రేటు 6.95 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంపు మున్ముందు మరింత పెంపుకు సంకేతంగా భావిస్తున్నారు.
అంతకుముందు హోంలోన్ వడ్డీ రేట్లు 6.80 శాతంగా ఉండగా, ఎస్బీఐ మార్చి 1న 6.70 శాతానికి తగ్గించింది. నెల రోజుల పాటు ఈ ఆఫర్ ఇచ్చింది. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఎస్బీఐ కేవలం వడ్డీ రేట్ల పెంపుతోనే ఆపలేదు. ప్రాసెసింగ్ ఫీజును కూడా యాడ్ చేసింది. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతంగా ఉంది. జీఎస్టీ అదనం. ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ.10,000, గరిష్టం రూ.30,000గా ఉంది.

ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులు కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీతో పాటు పలు బ్యాంకులు నెల రోజుల పాటు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇచ్చాయి. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications