SBI: ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. ఆ వివరాలు హ్యాక్ అయినట్లు అంగీకారం..!
ఒక సైబర్ ఘటన కారణంగా హ్యాకర్లు తమ బ్యాంకు కస్టమర్ రికార్డులను హ్యాక్ చేశారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక ఫైలింగ్‌లో వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (PIF) ఉన్న 3,897 కస్టమర్ రికార్డులు డార్క్ వెబ్‌లో బహిర్గతమయ్యాయని తాము అనుమానిస్తున్నట్లు ఎస్‌బిఐ పేర్కొంది. ఈ ఘటన తమ ప్రధాన కార్యకలాపాలు ఆర్థిక పనితీరు లేదా వ్యాపార కొనసాగింపుపై గణనీయంగా ప్రభావం చూపలేదని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 16న కస్టమర్ డేటా బహిర్గతమైనట్లు అనుమానిస్తున్నామని, థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ , ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి తమకు ఒక హెచ్చరిక అందిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
డార్క్ వెబ్‌లో లభించిన సుమారు 3,75,000 రికార్డుల ప్రాథమిక విశ్లేషణలో, వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం ఉన్న 3,897 కస్టమర్ రికార్డులను గుర్తించినట్లు ఎస్‌బిఐ వెల్లడించింది. బహిర్గతమైన సమాచారంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, జెండర్, ఈమెయిల్ అండ్రస్, రెసిడెన్షియల్ అడ్రసులు ఉన్నట్లు సమాచారం. ఈ రికార్డులలో బ్రాంచ్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ ఐడెంటిఫైయర్‌లు, లీడ్ ఐడీలు, లోన్, లీడ్ రికార్డులు ఇతర సంబంధిత ఫైళ్లకు సంబంధించిన మెటాడేటా కూడా ఉన్నాయని ఎక్సేంజ్ కు సమర్పించిన ఫైలింగ్ లో ఏస్బీఐ పేర్కొంది. ఈ సంఘటన వల్ల వినియోగదారుల రికార్డులు బహిర్గతమైనప్పటికీ, ఇది ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపదని తెలిపింది.

బ్యాంకు ప్రధాన వ్యాపార కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకు తన సైబర్ సంఘటన ప్రతిస్పందన, నివారణ ప్రోటోకాల్‌లను తక్షణమే అమలు చేసింది. బహిర్గతమైన డేటా ప్రామాణికత, సంపూర్ణతను నిర్ధారించడానికి, దాని సంభావ్య మూలాన్ని గుర్తించడానికి, నష్టం పరిధిని నిర్ధారించడానికి, వినియోగదారులకు, బ్యాంకుకు ఉన్న నష్టాలను అంచనా వేయడానికి ఒక సమగ్ర దర్యాప్తు అవసరమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. గుర్తించిన 3,897 వినియోగదారుల రికార్డులపై దర్యాప్తు కొనసాగుతున్నందున, బ్యాంకు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది.
వర్తించే నియంత్రణ అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని వివరించింది. అంతకుముందు సిరియస్‌మి అనే అనామక హ్యాకర్ గ్రూప్, 3.75 లక్షల ఎస్‌బిఐ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని తాము సంపాదించినట్లు డార్క్ వెబ్ ఫోరమ్ బ్రీచ్‌ఫోరమ్స్‌లో ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటనలో పాల్గొన్న హ్యాకర్ గ్రూప్ పేరును ఎస్‌బిఐ వెల్లడించలేదు. బ్యాంకింగ్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై నియంత్రణ సంస్థల దృష్టి పెరిగిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. జూలైలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1TB వినియోగదారుల డేటాను బహిర్గతం చేసిన డేటా లీక్‌ను అంగీకరించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications