SBI Amrut Kalash: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగుతున్న అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిలో డబ్బు దాచుకోవటం సురక్షితమని మనలో చాలా మంది భావిస్తుంటాం. అందుకే ఎస్బీఐ తన ప్రియమైన పెట్టుబడిదారుల కోసం సరికొత్త స్కీమ్ ప్రత్యేకంగా తెచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బ్యాంక్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అమృత్ కలశ్ స్కీమ్ గురించే. ప్రజల నుంచి దీనికి వస్తున్న విశేష ఆదరణ కారణంగా స్కీమ్ గడువును మరోసారి పొడిగించాలని బ్యాంక్ నిర్ణయించింది. వాస్తవానికి ఇది 400 రోజుల గడువుతో డబ్బు డిపాజిట్ చేసేందుకు తీసుకురాబడిన ప్రత్యేక స్కీమ్. దీని గడువు గతనెల 31తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని పొడిగించిన గడువు గురించి బ్యాంక్ వెల్లడించింది.

గతంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుసార్లు ఈ పథకం గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. స్కీమ్ కింద డబ్బును బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసిన సాధారణ కస్టమర్లు అత్యధికంగా 7.1 శాతం వడ్డీని పొందుతుండగా.. సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై గరిష్ఠంగా 7.6 శాతం వడ్డీని బ్యాంక్ స్కీమ్ కింద చెల్లిస్తోంది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం కస్టమర్లు పొందే వడ్డీపై టీడీఎస్ విధించబడుతుందని గుర్తుంచుకోండి.
స్కీమ్ కింద తమ డబ్బును డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తులు తమకు సమీపంలోని ఎస్బీఐ శాఖను సందర్శించవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఖాతాదారులు ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. స్కీమ్ కింద ఎవరైనా గరిష్ఠంగా రూ.2 కోట్ల లోపు మాత్రమే డిపాజిట్ చేసేందుకు అనుమతి ఉంది. మధ్య కాలానికి డబ్బును పొదుపు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరం. ఒకవేళ గడువుకు ముందే కావాలన్నా డబ్బును ఉపసంహరించుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. డిపాజిట్లపై క్రెడిట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉండటం స్కీమ్ ప్రత్యేకత.


Click it and Unblock the Notifications