ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన కొన్ని రోజులకు కస్టమర్లకు షాకిచ్చింది. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై అందించే వడ్డీలో 50 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. ఈ కోత జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా జూన్ 6, 2025న జరిగిన ద్రవ్య విధాన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లను తగ్గించిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించగా..తాజాగా ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను సవరించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఇప్పటికే తమ వడ్డీ రేట్లను తగ్గించాయి.
FDలపై వడ్డీ రేట్లను తగ్గించిన SBI తర్వాత ఇప్పుడు సాధారణ పౌరులకు 3.05 శాతం నుండి 6.45 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 3.55 శాతం, 7.05 శాతం వడ్డీ రేట్లను (SBI Wecareతో సహా) అందిస్తోంది. SBI గతంలో సాధారణ కస్టమర్లకు 3.3 శాతం, 6.7 శాతం మధ్య FD వడ్డీ రేటును అందించింది. సీనియర్ సిటిజన్లకు..బ్యాంక్ 3.8 శాతం, 7.30 శాతం వడ్డీ రేట్లను (SBI Wecare తో సహా) అందించింది. ఇక అమృత్ వృష్టి పథకంలో కూడా బ్యాంక్ రేట్లను తగ్గించింది. 444 రోజుల FD పథకం ఇప్పుడు 6.60 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా.. ఇది గతంలో 6.85 శాతంగా ఉంది.

సాధారణ డిపాజిటర్లు, పొదుపు బ్యాంకు ఖాతాలలో తమ డబ్బును ఉంచే సీనియర్ సిటిజన్లపై ఈ మార్పు తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. 211 రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల డిపాజిట్ల విషయానికి వస్తే. సాధారణ కస్టమర్లకు 6.3 శాతం నుండి 6.05 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలానికి డిపాజిట్ రేటు 6.8 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలలోపు పరిపక్వ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 6.5 శాతం నుండి 6.25 శాతానికి సవరించారు. సీనియర్ సిటిజన్లకు గతంలో 7 శాతం నుండి 6.75 శాతం వడ్డీ రేటు వచ్చేది.
రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలలోపు పరిపక్వత చెందే టర్మ్ డిపాజిట్లను పరిశీలించినట్లైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 6.7 శాతం నుండి 6.45 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 7.2 శాతం నుండి 6.95 శాతానికి తగ్గించారు.మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సవరించిన రేట్లు వరుసగా 6.3 శాతం, 6.05 శాతంగా ఉన్నాయి.
కాగా జూన్ 15 నుండి అమలులోకి వచ్చిన.. రెపో-లింక్డ్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-బేస్డ్ లెండింగ్ రేటు (EBLR) 50 బేసిస్ పాయింట్లు సవరించడం జరిగింది. ఇది ఇప్పుడు గృహ రుణాలపై 7.5 శాతం నుండి 8.45 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా అనేక బ్యాంకులు ఇప్పటికే తమ రెపో-లింక్డ్ లెండింగ్ రేట్లను తగ్గించాయి.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications