SBI News: డిజిటలైజేషన్ ఊపందుకున్న తర్వాత దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో అవి తమ బ్రాండింగ్ పై కూడా ఎక్కువగా దృష్టి సారించాయి. ఇందుకోసం సెలబ్రిటీలను ప్రధానంగా క్రీడాకారులను ఎంచుకుంటున్నాయి.
బ్యాంకులు తమ బ్రాండ్‌ను, ప్రకటనలను కస్టమర్లకు సులభంగా చేరువ చేసేందుకు ప్రసిద్ధ క్రీడాకారులను ఎంచుకుంటున్నాయి. అథ్లెట్‌కు ఇది పెద్ద స్పాన్సర్‌షిప్. కొన్ని బ్యాంకులు క్రీడాకారులకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. మెున్న దీపావళికి అంబానీకి చెందిన జియో ఉత్సవ్ సేల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎమ్ఎస్ ధోనా తాజాగా మరో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో స్టేట్ బ్యాంక్ ప్రకటనలు, అవగాహన పోస్టుల్లో ధోనీ ప్రత్యక్షం అయ్యారు.

ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఫెడరల్ బ్యాంక్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్‌లను నియమించుకున్నాయి. మంచి మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి రిటైరైనప్పటికీ ఐపీఎల్ లో ఆట కొనసాగిస్తున్నాడు. ఆయన నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలగటమే అతని సామర్థ్యం.
బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయడంపై ఫెడరల్ బ్యాంక్ CMO ఎంవిఎస్ మూర్తి స్పందించారు. ప్రపంచ ఛాంపియన్‌గా ఆడటం అంటే ఫిట్‌నెస్, శిక్షణ, ఆహారం, మానసిక ఆరోగ్యం వంటి అనేక అంశాలను అత్యుత్తమంగా నిర్వహించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్షణాల్లోనే ఫెడరల్ బ్యాంక్ కూడా నిలుస్తుందని చూపించడానికి ప్రయత్నించింది.


Click it and Unblock the Notifications