SBI Alert: స్టేట్ బ్యాంక్ యూపీఐ వాడుతున్నారా.. అయితే ఈ రోజు పేమెంట్స్ కస్టమే.. ఎందుకంటే..
UPI Down: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ ఉందా. అయితే ఈ వార్త మీకోసమే. తమ ఖాతాదారులకు శనివారం కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని బ్యాంక్ తన ట్విట్టక్ ఖాతా ద్వారా వెల్లడించింది. బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. జూన్ 25 శనివారం ఉదయం 00:30 నుంచి సాయంత్రం 4:30 వరకు SBI UPI సేవల్లో అంతరాయం కలగవచ్చని వెల్లడించింది. దీని వల్ల సేవలు ప్రభావితం కానున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం తెలిపింది.
SBI ట్వీట్ ద్వారా "25-జూన్-2022 అర్ధరాత్రి 00.30 గంటల నుంచి 04.30 గంటల మధ్య UPIలో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తాము. ఈ కాలంలో.. UPI సేవలు అందుబాటులో ఉండవు." అంటూ ట్విట్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ అంతరాయం ఏర్పడునున్నట్లు తెలుస్తోంది. SBI ఇటీవల వివిధ రకాల ఆర్థిక సేవల కోసం కొత్త టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది.

కస్టమర్‌లు ఈ కొత్త కాంటాక్ట్ సెంటర్ నంబర్‌కు కాల్ చేసి వారి ఇంటి వద్ద నుంచి లేదా మరే ఇతర ప్రదేశం నుంచైనా ముఖ్యమైన, ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలను చేయవచ్చని వెల్లడించింది. బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించడం లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఉపయోగించడం వల్ల ఖాతాదారులకు సమయం ఆదా కావటంతో పాటు ఇబ్బందులు తగ్గుతాయని బ్యాంక్ అభిప్రాయపడింది.
మార్చిలో కొంతమంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంక్ YONO యాప్ ద్వారా ఫోన్లకు కొన్ని తప్పుడు సందేశాలు వచ్చాయి. బగ్ గురించి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత వివరణ ఇచ్చింది. సాంకేతిక సవాళ్ల కారణంగా కొంతమంది వినియోగదారులు Yono Lite ప్రోగ్రామ్‌లో తప్పు నోటిఫికేషన్ మెసేజ్ లను అందుకుంటున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.


Click it and Unblock the Notifications