SBI News: యుద్ధంపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బిఐ కొత్త ఛైర్మన్.. పూర్తి వివరాలివే..
State Bank of India: ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులకు పెద్ద హెచ్చరికను జారీ చేసింది. గడచిన కొన్నాళ్లుగా దేశీయంగా బ్యాంకుల్లో ప్రజలు డబ్బులు డిపాటిట్లుగా వేయటంలేదని తెలిపింది. ఈ ఆందోళనల మధ్య ఎస్బీఐకి కొత్త చైర్మన్ గా వచ్చిన తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు సెట్టి కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం పోటీ ఉన్నప్పటికీ డిపాజిట్లను ఆకర్షించడానికి "రేట్ వార్"లో తమకు పాల్గొనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. డిపాజిట్‌లలో నిరాడంబరమైన 8% నుంచి 10% వృద్ధి ఉన్నప్పటికీ.. పెద్ద బేస్ ఈ సంవత్సరం ఊహించిన 14% నుంచి 16% క్రెడిట్ వృద్ధికి సరిపోతుందని నిర్ధారిస్తుందని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో సెట్టి చెప్పారు. అయితే తాము దూకుడు రేట్ల పెంపుదలకు బదులుగా.. విస్తృతమైన బ్రాంచ్ నెట్‌వర్క్, సేవా నాణ్యతను డిపాజిట్లను ఆకర్షించడానికి ఉపయోగించనున్నట్లు చెప్పారు. అయితే డిపాజిట్ రేట్లలో కొన్ని చిన్న సర్దుబాట్లు ఆశించబడతాయన్నారు.

ఇటీవలే ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సెట్టీ డిపాజిట్ల కోసం జరుగుతున్న పోటీని అంగీకరించారు. అయితే SBI బలమైన డిపాజిట్ బేస్‌పై నమ్మకంతో ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన బ్యాంక్ బలమైన కార్పొరేట్ క్రెడిట్ వృద్ధిని కూడా హైలైట్ చేశారు. పునరుత్పాదకత, మౌలిక సదుపాయాల వంటి ప్రధాన రంగాలలో సానుకూల ధోరణులను చూస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఎండీ అశ్విని కుమార్ తివారీ కూడా డిపాజిట్ల సేకరణలో ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈక్విటీ మార్కెట్లు కాలక్రమేణా కరెక్ట్ అయినందున, బ్యాంకుల నుంచి దూరంగా వెళ్లిన కొన్ని నిధులు తిరిగి వస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత తరుణంలో పెద్ద డిపాజిట్ల కోసం ట్రస్ట్‌లు, సొసైటీలు, ఆసుపత్రులు వంటి విభాగాలపై ఎస్‌బీఐ చురుగ్గా దృష్టి సారిస్తోందని అశ్విని కుమార్ తివారీ పేర్కొన్నారు. ఇవి గతంలో అంతగా శ్రద్ధ తీసుకోని ప్రాంతాలను పేర్కొన్నారు. డిపాజిట్ సమీకరణ కోసం ప్రత్యేకంగా అవుట్‌బౌండ్ బృందాలను నియమించడానికి డిజిటల్ ప్రయత్నాలకు మించి బ్యాంక్ ఇప్పుడు మరింత దూకుడుగా చిన్న-టికెట్ డిపాజిట్లను లక్ష్యంగా చేసుకుంటోందని తివారీ ఎత్తి చూపారు.


Click it and Unblock the Notifications