Bengaluru IT: బెంగళూరుకు టెక్ కంపెనీ గుడ్ బై.. ఆ నగరానికి చెక్కేస్తున్న సంస్థ
RIP Bengaluru Tech: తాజాగా కర్ణాటక ప్రభుత్వం కన్నడిగులకు ఉద్యోగాల రిజర్వేషన్ పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇకపై.. మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు 50 శాతం, నాన్‌మేనేజ్‌మెంట్ కేటగిరీల్లో 70 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం పొందటం అక్కడి పారిశ్రామికవేత్తలను కలవరానికి గురిచేస్తోంది. పలువురు ఇప్పటికే సోషల్ మీడియా ముఖంగా దీనిపై తమ వైఖరిని వెల్లడిస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వ తీరుపై పరిశ్రమ ప్రముఖులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన వ్యవస్థాపకుడు గ్రేప్‌వైన్‌లో తన తర్వాతి ప్రణాళికలను పంచుకున్నారు. ప్రస్తుతం తరిణంలో తాను తన వ్యాపారాన్ని బెంగళూరు నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి తాను వ్యాపారాన్ని నిర్మించటానికి 10 ఏళ్లు గడిపినట్లు చెప్పారు. ఇప్పుడు తాను చెన్నై వైపు చూస్తున్నానని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. వ్యవస్థాపకుడు కొన్ని గంటల తర్వాత తన స్టాండ్‌ను స్పష్టం చేస్తూ మరొక పోస్ట్‌ను పంచుకున్నారు.

వాస్తవానికి తాను పుట్టింది పెరిగింది తమిళనాడులోనే అయినప్పటికీ స్వస్థలం చెన్నై కంటే బెంగుళూరుతో ఎక్కువగా గుర్తించబడ్డానని సదరు వ్యవస్థాపకుడు పేర్కొన్నాడు. బెంగళూరు నగరం తనకు, తన కుటుంబానికి తమ వద్ద ప్రస్తుతం ఉన్న అన్నింటిని ఇచ్చిందని చెప్పారు. తన భార్య, పిల్లలు కన్నడ మాట్లాడటం పూర్తిగా వచ్చినవారని.. వలస వచ్చినవారిపై కన్నడ అయినా ఎవరిపైనైనా ఒక భాషను విధించడాన్ని తాను 100 శాతం వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు.
వ్యవస్థాపకుడు తన మొదటి సందేశం పోస్ట్ ద్వేషపూరిత DMలకు దారితీసిందని చెప్పారు. వాస్తవానికి తాను కూడా ఉండవచ్చు కానీ అది తన వ్యాపారాన్ని తరలించడానికి మాత్రమే పరిమితం అవుతుందన్నారు. బెంగళూరులో ఇల్లు , ఎల్లప్పుడూ తన ఇల్లులా ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కన్నడిగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను రిజర్వు చేయాలని ప్రభుత్వం ఆమోదించిన బిల్లను హోల్డులో పెట్టినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఎన్డీటీవీ నివేదించింది. కంపెనీల యజమానుల నుంచి తీవ్రస్థాయిలో వస్తున్న వ్యతిరేకతల దృష్ట్యా బిల్లుపై ప్రస్తుతం వెనకడుగు వేసినట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications