Success Story: ఉద్యోగుల జీవితాలు మార్చేసిన యజమాని.. ఉద్యోగులకు రూ.40 కోట్లు..
Jyoti Bansal: కొందరు యజమానులు తమ ఎదుగుదలతో పాటు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల గురించి కూడా ఆలోచిస్తుంటారు. అయితే ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటుంటారు. అయితే ఇప్పుడు జ్యోతి బన్సాల్ అనే ఒక యజమాని చేసిన పనితో అతని ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ వైరల్ సక్సెస్ స్టోరీ గురించి పరిశీలిస్తే..
జ్యోతి బన్సాల్ చేసిన పని ప్రస్తుతం అనేక మంది వ్యాపారవేత్తలకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. తాను స్థాపించిన యాప్‌డైనమిక్స్ అనే స్టార్టప్ కంపెనీని అమెరికా దిగ్గజ సంస్థ సిస్కోకు ఏకంగా రూ.31,000 కోట్లకు విక్రయించాడు. అయితే ఈ చర్య అతని ఉద్యోగుల తలరాతను మార్చేసింది. దీనికి ముందు జ్యోతి బన్సాల్ శాన్ ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో అనేక సంవత్సరాలు పనిచేసి గొప్ప సాంకేతిక నైపుణ్యాలను పొందాడు. అలా సొంతంగా 2017లో స్థాపించిన కంపెనీనే యాప్ డైనమిక్స్.

వాస్తవానికి పెద్ద కంపెనీలు తమ సేవలు సజావుగా కొనసాగించటానికి యాప్ డైనమిక్స్ ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చేదిగా ఉంది. ఈ సంస్థ బన్సాల్‌ను విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది. ఈ కంపెనీని కొనుగోలు చేయటానికి సిస్కో ఏకంగా 3.7 బిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది. ప్రతిపాదనను మనస్పూర్తిగా అంగీకరించి తన ఉద్యోగులకు కూడా విజయంలో వాటా ఇచ్చాడు. దీని ద్వారా దాదాపు 400 మంది ఉద్యోగులు సుమారు రూ.8 కోట్లు అందుకున్నారు. కొంతమంది ఉద్యోగులు ఏకంగా దాదాపు రూ.40 కోట్లు వరకు ప్రయోజనాలను పొందారు. వాస్తవానికి ఇది ఉద్యోగుల జీవితంలో పెద్ద ఆర్థిక బహుమతిని అందించిందని చెప్పుకోవచ్చు.
సిస్కోకు ఫ్యానీ రేటుకు కంపెనీని విక్రయించినప్పటికీ అది అతడికి అనేక నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. కంపెనీని అమ్మటంతో మంచి ఆదాయం వచ్చిందని పార్టీ చేసుకున్నప్పటికీ అతనిలో ఇంకా అసంతృప్తి మిగిలిపోయింది. ఇంకొద్దిగా సమయం ఉండి ఉంటే కంపెనీని మరింతగా అభివృద్ధి చేసేవాడినని అనుకున్నాడు. అయితే దీని తర్వాత కొత్త వెంచర్లను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం వివిధ సాంకేతికత, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
స్టార్టప్ వ్యవస్థాపకులు తమ కంపెనీని విక్రయించాలని నిర్ణయించేటప్పుడు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అరుదు. Zscaler వ్యవస్థాపకుడైన జే చౌదరి 1998లో వెరిసైన్ ద్వారా 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినప్పుడు ఇలాంటిదే జరిగింది. కంపెనీని కొనుగోలు చేసిన రెండు సంవత్సరాల తర్వాత వెరిసైన్ స్టాక్ పెరిగినప్పుడు కంపెనీలోని 80 మంది ఉద్యోగుల్లో దాదాపు 70 మంది మిలియనీర్లుగా మారిపోయారు. ప్రస్తుతం జ్యోతి బన్సాల్ సైతం ఇదే తరహాలో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు.


Click it and Unblock the Notifications