ప్రేమకు మాత్రమే కాదు, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కూడా వయసుతో సంబంధం లేదు అని మరోసారి నిరూపించింది ఈ మహిళా. అది KFC కి చెందిన కల్నల్ హార్లాండ్ సాండర్స్ అయినా కావచ్చు లేదా మరెవరైనా కావ్వొచ్చు. కేవలం ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ అప్ పెట్టి సక్సెస్ అయినా వాళ్ళు ఈ రోజుల్లో చాల మంది ఉన్నారు. అంతేకాదు ఈ స్టార్ట్ అప్ తక్కువ ఖర్చుతో మొదలై ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కల్నల్ హార్లాండ్ సాండర్స్ 65 సంవత్సరాల వయసులో KFCని ప్రారంభించగా, చెన్నైకి చెందిన కృష్ణవేణి బంగార కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఎందుకంటే 78 ఏళ్ల కృష్ణవేణి బంగార పిల్లలకు కావాల్సిన బట్టలకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది. వీటిలో తువ్వాళ్లు అలాగే డైపర్లు వంటివి కూడా ఉన్నాయి.

కృష్ణవేణి బంగార 24 సంవత్సరాల క్రితం 'కిట్టిస్ కేర్' పేరుతో ఈ చిన్న పని ప్రారంభించారు. అది కూడా 2000 ఫిబ్రవరిలో మొదలైంది. ఒకానొక సందర్భంలో కృష్ణవేణి బంగార చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి ఉంది. ఆమె తనకి మనవరాలు లేదా మనవడు పుడతాడ అనుకుంటూ ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆమె చేతిలో రెండు కొత్త పిల్లల బట్టలు ఉన్నాయి. ఒకటి నీలం రంగులో, మరొకటి గులాబీ రంగులో. అయితే అప్పుడే వచ్చి మీకు మనవరాలు పుట్టింది అని డాక్టర్ ఆమెకు చెప్పారు. దింతో కృష్ణవేణి బంగార చాలా సంతోషించింది. వెంటనే ఆమె పుట్టిన పాపకి పింక్ కలర్ బట్టల సెట్ ఇచ్చింది. ఈ సెట్‌లో పుట్టిన పాప కోసం ఒక బెడ్ మ్యాట్, క్యాప్, చేతి గ్లవుజులు ఇంకా బట్టలు ఉన్నాయి.
జీవితంలో మార్పు తెచ్చిన క్షణం: అయితే ఆ చిన్న క్షణం తన జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని కృష్ణవేణి బంగారకి తెలియదు. ఎందుకంటే దింతో ఆమె ఆర్థికంగా స్వతంత్రంగా మారే వ్యాపారాన్ని ప్రారంభించింది. అంతేకాక ఆమె చాలా మంది డెలివరీ అయినా తల్లులకు కూడా సహాయం చేసింది. ఇప్పుడు కృష్ణవేణి బంగార వయసు 78 సంవత్సరాలు. ఆమె తన పాత రోజుల గురించి మాట్లాడుతు తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని, ఈ రోజు కూడా ఈ పని చేయడానికి అదే తనను ప్రేరేపిస్తున్నట్లు ఆమె చెబుతోంది.
డాక్టర్ ఆమె పనిని ప్రశంసించిన క్షణాలు: డాక్టర్ తనను గుర్తించి, ఆమె చేసిన పనిని అభినందించారని కృష్ణవేణి బంగార చెప్పింది. ఇదే ఆమెకి ఇంకా 'కిట్టిస్ కేర్' ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చింది. అయితే డెలివరీ తర్వాత గైనకాలజిస్ట్ డాక్టర్ శాంత కృష్ణవేణి బంగారకి ఫోన్ చేసి పిల్లల బట్టల గురించి అడిగారని, అంతా అక్కడి నుంచే ప్రారంభమైందని కృష్ణవేణి చెబుతుంది. నా మనవరాలికి నేను కుట్టిన బట్టలు చూసి డాక్టర్ చాలా సంతోషించారు. కొన్ని రోజుల్లోనే ఆసుపత్రి వారు నన్ను పిల్లల బట్టలు డొనేట్ చేయమని కోరారు. అయితే వారు కొత్త తల్లులందరికీ అలంటి ఒక కిట్ ఇవ్వాలని ప్లాన్ చేసారు.
ఉదయం 5 గంటలకు మేల్కొంటానని చెప్తున్నా కృష్ణవేణి: కిట్టిస్ కేర్ ప్రారంభించిన తర్వాత ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసే దానినని కృష్ణవేణి చెబుతోంది. తర్వాత ఉదయం 10 గంటలకల్ల ఆమె పిల్లలకు బట్టలు తయారు చేసే పని ప్రారంభిస్తుంది. అయితే ఆమె కొంతమంది టైలర్లను కూడా తనకి సహాయంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఆమె స్వయంగా బట్టలు కట్ చేసి కుట్టడానికి టైలరుకి ఇస్తుంది. కృష్ణవేణి బంగార పిల్లలకు అవసరమైనవన్నీ సిద్ధం చేస్తుంది. తువ్వాళ్లు ఇంకా డైపర్లు వంటివి కూడా. ఆమె ఈ పనిని చాలా ప్రేమతో, శ్రద్ధతో చేస్తుంది. ఇంకా కృష్ణవేణి బంగార వీటికోసం కాటన్ ఇంకా మైక్రోఫైబర్ టవల్స్ కొంటుంది. తర్వాత ఆమె వాటిని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తుంది. ఆమె పిల్లల బట్టలు, జుబ్బాలు ( వదులుగా ఉండే బట్టలు), లాంగోట్ (న్యాపీలు), చేతి తొడుగులు, సాక్స్, బెడ్ పైన మ్యాట్స్, డ్రై షీట్లు ఇంకా బేబీ బిబ్స్ కూడా తయారు చేస్తుంది.
ధర ఎంత అంటే: ఆమె ఒక్కో కిట్ ధర దాదాపు రూ.250 నుండి రూ.350 వరకు ఉంటుంది. అది కూడా కస్టమర్లు కిట్‌లో ఎం సెలెక్ట్ చేసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆసుపత్రిలోని ఆమె బేబీ కిట్‌లో వారు ఎం కోరుకుంటున్నారనే దాని గురించి వారికి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి కాబట్టి. మొదట్లో కృష్ణవేణి బంగార ప్రతిదీ ఆఫ్‌లైన్‌లోనే చేసేది, కానీ కరోనా మహమ్మారి సమయంలో ఆమెకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోయింది. ఆ సమయంలోనే 'కిట్టిస్ కేర్' ఆన్‌లైన్‌లో అమ్మకాలు స్టార్ట్ చేసింది. ఇందుకు ఆమె ఫోన్‌లో కస్టమర్లతో మాట్లాడడం, తన టైలరును ఇంటి నుండి పని చేయమని ఇంకా సకాలంలో కిట్టీస్ కుట్టి డెలివరీ చేయలని కోరింది. అంతేకాక ఆ సమయంలో ఆర్డర్లు సకాలంలో కస్టమర్లకు చేరేలా కూడా ఆమె చూసుకున్నారు. అలాగే కృష్ణవేణి ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకోవడం కూడా ప్రారంభించినట్లు చెప్పింది. ఇందుకు ఆమె మనవళ్లు కూడా ఎంతో సహాయం చేసినట్లు తెలిపింది.
విదేశాలకు విస్తరించిన వ్యాపారం: నేడు కృష్ణవేణి వ్యాపారం ఇండియాలోనే కాదు విదేశాలకు కూడా విస్తరించింది. కరోనా తర్వాత, ఒకసారి కృష్ణవేణి బంగార తన కుటుంబంతో కలిసి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లింది. కానీ అక్కడ ఆమె పని ఆగలేదు. చెన్నైలో తనకు ఏర్పడిన సంబంధాల కారణంగా, ఆమె తన పనిని రిమోట్‌గా కొనసాగించింది. కృష్ణవేణి బంగార మాట్లాడుతూ 'కరోనా మహమ్మారి కారణంగా నేను ఇప్పుడు నా పనిని ఎక్కడి నుండైనా చేసుకోగలుగుతున్నాను. నేను ఒక సంవత్సరం క్రితం మస్కట్‌కు వెళ్లాను. నాకు ఇక్కడి నుండి కూడా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని కూడా నిర్వహిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications