కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. అయితే ఐటీ సహా వివిధ రంగాలు ఉద్యోగులను క్రమంగా ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. ఇందులో భాగంగా టెస్లా కూడా తమ ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా హుకూం జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలని, ఇక ఆఫీస్‌లకు రావాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులకు తేల్చి చెప్పారు. తమ కంపెనీలో వర్క్ ప్రమ్ హోమ్ ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ మేరకు ఈ-మెయిల్ పంపించారు.
కార్యాలయాలకు రావడం ఇష్టంలేని ఉద్యోగులు టెస్లాను విడిచిపెట్టి వెళ్లాలని సూచించారు. ఆఫీస్‌కు రండి లేదా ఉద్యోగం వదిలేయండి అని నిక్కచ్చిగా చెప్పేశారు. రిమోట్ వర్క్ మోడ్‌ను ఎంచుకునేవారు ఎవరైనా వారానికి కనీసం 40 గంటలు కార్యాలయంలో ఉండాలన్నారు. లేదంటే టెస్లా నుండి వెళ్లిపోవచ్చునని అధికారిక ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.

కార్యాలయంలో కనీస గంటలు పని చేయలేని అసాధారణ వ్యక్తులను మాత్రం తాను స్వయంగా సమీక్షించి, అనుమతి ఇస్తానని తెలిపారు. ఆఫీస్ అంటే టెస్లా ప్రధాన కార్యాలయమని, ఏ ఇతర శాఖ కార్యాలయం కాదన్నారు. కాగా, స్పేస్ ఎక్స్‌ను ప్రారంభించిన తొలినాళ్లలో అక్కడి ఇంటర్న్స్ కొందరు కాఫీ షాపు ముందు వరుస కట్టడం చూసిన మస్క్ వారిపై మండిపడ్డారట. ఉద్యోగుల కదలికలను గుర్తించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications