ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిధ్దమవుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ దీనికి సంబంధించిన లైసెన్స్ ను భారత ప్రభుత్వం నుండి పొందింది. అయితే భారత ప్రభుత్వం ఈ కంపెనీపై కొన్ని ప్రత్యేక ఆంక్షలు విధించింది. స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే అందించగలదని టెలికాం సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పార్లమెంటులో తెలిపారు. దీనికి కారణం ఏంటంటే ఈ కంపెనీకి స్పెక్ట్రమ్ లేకపోవడమే.. స్టార్ లింక్ రాకతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దేశీయ కంపెనీలకు తక్షణ ముప్పు లేదని తెలుస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ.. Starlink ప్లాన్ నెలకు దాదాపు రూ. 3 వేలు ఉండవచ్చని అన్నారు. ఇది జియో, ఎయిర్‌టెల్ కంటే ఖరీదైనది కానీ శాటిలైట్ ఇంటర్నెట్‌కు పర్వాలేదు. స్టార్‌లింక్ భారతదేశంలో 20 లక్షల మంది వినియోగదారులకు మాత్రమే సేవలను అందించగలదు. దీని వేగం 200 Mbps వరకు ఉంటుంది. ఇది టెలికాం సేవలను ప్రభావితం చేయదన్నారు.ప్రధానంగా ఈ సేవలు ప్రముఖ టెలికాం సేవలు అందని గ్రామీణ, లోతట్టు ప్రాంతాలకు లక్ష్యంగా ఉండబోతున్నాయన్నారు.

స్టార్‌లింక్ వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు భారతదేశపు టెలికాం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాంకేతికంగా పర్యవేక్షణ, లైసెన్సింగ్, ధరల నియంత్రణ, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళుతోంది. దేశంలో ఇప్పటికే Jio, Airtel, BSNL వంటి బలమైన టెలికాం కంపెనీలు పని చేస్తుండటంతో, స్టార్‌లింక్‌ను విస్తృత స్థాయిలో ప్రజలు తీసుకోవడం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికంగా ఖర్చయ్యే డిష్, శ్రేణిలో ఉండే పరికరాలు, నెలవారీ ఖర్చు వంటి కారణాలు గ్రామీణ వినియోగదారులకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
సాధారణంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం, భారత్‌లో Starlink వృద్ధి పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఇది నెషనల్ టెలికాం పాలసీ, డిజిటల్ ఇండియా లక్ష్యాలతో కలిసేలా సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం స్టార్‌లింక్ ఇంకా కమర్షియల్ లైసెన్స్ కోసం అనుమతుల దశలోనే ఉంది. ఒకవేళ అన్ని మంజూరులు పొందిన తరువాత, ఇది ప్రారంభ దశలో సేవలను ప్రారంభించి, తరువాత వినియోగదారుల స్పందన ఆధారంగా విస్తరణ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం స్టార్‌లింక్ 100 కంటే ఎక్కువ దేశాలలో సుమారు 50 లక్షల మందికి తన సేవలను అందిస్తోంది. భారతదేశంలో 20 లక్షల మంది కస్టమర్లను పొందగలిగితే కంపెనీ రేసులోకి దూసుకువచ్చినట్లే.BSNL వంటి కంపెనీలు సరిగ్గా చేరుకోలేని మారుమూల ప్రాంతాలలో శాటిలైట్ ఇంటర్నెట్ కు ఇది ఉపయోగపడుతుంది.స్టార్‌లింక్ యొక్క 4,408 ఉపగ్రహాలు భూమి నుండి 540-570 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో తిరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఇది భారతదేశంలో 600 Gbps వేగాన్ని అందించగలదు. కంపెనీకి 5 సంవత్సరాల పాటు ఈ లైసెన్స్ ఉంది. మస్క్ కంపెనీకి టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి లైసెన్స్ మరియు INSPACE నుండి అనుమతి లభించింది. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో దాని నిర్మాణం కోసం పరికరాలను దిగుమతి చేసుకోవడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి అనుమతి కోరుతుంది.


Click it and Unblock the Notifications