భారతదేశంలో AI హంగామా మరో స్టేజ్‌కి చేరబోతోంది! ChatGPT ని డెవలప్ చేసిన OpenAI ఇప్పుడు తన $500 బిలియన్ Stargate ప్రాజెక్ట్ కోసం ఇండియాలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేసే చర్చలు మొదలెట్టింది. గరిష్ట AI computing కోసం ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్, భారత IT, data centre, మరియు renewable energy రంగాలకు పెద్ద అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
రిపోర్ట్స్ ప్రకారం, OpenAI ఇప్పటికే సిఫీ టెక్నాలజీస్, యోటా డేటా సర్వీసెస్, E2E నెట్‌వర్క్స్, CtrlS డాటా సెంటర్స్ వంటి భారతీయ డాటా సెంటర్ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది. ముఖ్యంగా కేపాసిటీ, పవర్ సప్లై, లొకేషన్ లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. అదే విధంగా, రీలయన్స్ ఇండస్ట్రీస్‌తో గుజరాత్‌లోని జమ్నగర్ డాటా సెంటర్ కోసం ఆరు నెలలుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం గిగావాట్ స్థాయిలో పవర్ మరియు భారీ ఎలక్ట్రిసిటీ సరఫరా అవసరం.

స్టార్ గేట్ అనేది OpenAI యొక్క $500 బిలియన్ ప్రాజెక్ట్, జనవరి 2024 లో ప్రకటించబడింది. సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ పార్ట్నర్స్ మద్దతుతో, ఇది హైపర్ స్కేల్ డాటా సెంటర్స్ నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లక్షల సంఖ్యలో GPUs, అడ్వాన్స్‌డ్ చిప్స్, పవర్ మరియు కూలింగ్ సిస్టమ్స్ ఉపయోగించి AI మోడళ్స్‌ను ట్రైన్ చేయడం మరియు రన్ చేయడం కోసం ప్లాన్ చేయబడింది. ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాల్లో దశలవారీ పెట్టుబడి రూపంలో అమలు కానుంది. ఇది ఓపెన్ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్ మరియు ఇతర భాగస్వాముల కోసం దీర్ఘకాలిక కంప్యూటింగ్ శక్తి ని సురక్షితం చేస్తుంది.
భారతదేశం OpenAI కి అమెరికా తర్వాత రెండవ పెద్ద మార్కెట్. కంపెనీ ఇప్పటికే చట్టపరమైన సంస్థగా రిజిస్టర్ చేసింది, న్యూఢిల్లీ ఆఫీస్ త్వరలో ప్రారంభం కానుంది, అలాగే స్థానిక నియామకాన్ని పెంచుతోంది. సామ్ ఆల్ట్మన్ భారత్‌ను వేగంగా పెరుగుతున్న మార్కెట్గా పేర్కొని, OpenAI ఉత్పత్తులను స్థానిక వినియోగదారుల కోసం మరింత సులభమైన విధంగా మార్చడానికి ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు చూస్తే, ప్రపంచ AI కంప్యూటింగ్ మార్కెట్‌లో భారత్ స్థానం చాలా తక్కువగా ఉంది. మొత్తం వాటాలో 1% కూడా రాదు. అంటే మన దగ్గర ఇంకా పెద్ద సౌకర్యాలు, అధునాతన వ్యవస్థలు మన దగ్గర లేవు.
స్టార్‌గేట్ లాంటి స్థాయి సెంటర్స్‌ను నిర్మించాలంటే, కేవలం కంప్యూటర్లు లేదా సర్వర్లు పెట్టడమే కాదు. అత్యాధునిక చిప్స్, గిగావాట్‌ల స్థాయి పవర్, ఇంకా వాటికి తగిన కూలింగ్ టెక్నాలజీ అన్నీ కావాలి. ఇవి లేకపోతే AI మోడల్స్‌ని పెద్ద స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదా నడిపించడం అసాధ్యం. ప్రస్తుతం మనం చిన్న scaleలో ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఈ తరహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటేనే, భారత్ గ్లోబల్ AI రేసులో ముందుకు రావచ్చు. సామ్ ఆల్ట్మన్ ఈ నెలలో భారత్ సందర్శించనున్నారు. ఈ సందర్శనలో OpenAI విస్తరణ ప్రణాళికలపై మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
OpenAI ఈ ప్రాజెక్ట్‌ని భారత్‌లోకి తీసుకురావడం వలన IT, డేటా సెంటర్, రిన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. భారీగా పెట్టుబడి అవసరం అవుతుంది, గిగావాట్ స్థాయి పవర్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీ కూడా కావాలి. అంటే భారత కంపెనీలు కొత్త నైపుణ్యం కోసం నియామకం పెంచుకోవాలి, ఇన్‌ఫ్రా కూడా అప్‌గ్రేడ్ చేయాలి.
అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ఇంత పెద్ద AI కంప్యూటింగ్ సెటప్ కోసం ఎనర్జీ సరఫరా, చిప్స్ లభ్యత, కూలింగ్ టెక్నాలజీ అన్నీ నాన్ స్టాప్ గా ఉండాలి. ఇవి లేకపోతే ప్రాజెక్ట్ ప్రమదంలో పడుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications