కాఫీ విషయానికి వస్తే స్టార్‌బక్స్ కాఫీ పేరు టక్కున నోట్లోకి వస్తుంది. అవును, ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కాఫీ హౌస్ చైన్ నడిపిస్తుంది. అలాగే భారతదేశంలో టాటా గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ఉంది. ఇప్పుడు, ఈ పెద్ద కంపెనీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ చేపట్టింది. దింతో సుమారు 1100 మంది ఉద్యోగులకు ఇంటికి పంపించేందుకు ఒక లిస్ట్ రెడీ చేసింది. అయితే కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా స్టార్‌బక్స్ సీఈఓ ఈ తొలగింపును ప్రకటించారు.
సేల్స్ తగ్గడంతోనే ఉద్యోగుల తొలగింపులు
రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్టార్‌బక్స్ కార్ప్ ఉద్యోగుల నుండి 1100 మంది ఉద్యోగులను తొలగించబోతోంది. ఛైర్మన్ అండ్ CEO బ్రియాన్ నికోల్ 2024 సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సేల్స్ తగ్గుముఖం పట్టడంతో గత సంవత్సరం ఉద్యోగుల తొలగింపులను ప్రకటించారు. అయితే సోమవారం ఉద్యోగులకు జారీ చేసిన ఓ లేఖలో ఈ సమాచారాన్ని వెల్లడించామని, ఈ తొలగింపులకు గురైన ఉద్యోగులకు మంగళవారం మధ్యాహ్నం నాటికి సమాచారం అందిస్తామని కంపెనీ చెప్పినట్లు నివేదికలో పేర్కొంది.

CEO బ్రియాన్ నికోల్ 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఈ తొలగింపు గురించి సూచించాడు. మార్చి ప్రారంభంలో స్టార్‌బక్స్ తొలగింపు చర్య తీసుకోవచ్చని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు 1100 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు కంపెనీలో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను కూడా తొలగిస్తామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్‌లో దాదాపు 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో 36,000 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి.
తొలగింపుల ప్రభావం ఉండదు.
నివేదిక ప్రకారం, స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ తొలగింపులకు సంబంధించి విడుదల చేసిన తన లేఖలో మరింత సమర్థవంతంగా పనిచేయడం, అకౌంటబిలిటీ పెంచడం, సంక్లిష్టతను తగ్గించడం, మెరుగైన ఇంటిగ్రేషన్ ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా వర్క్ ఫోర్స్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు, అయితే ఈ తోలగింపులు మేకింగ్ అండ్ వేర్ హౌస్ సంబంధిత సిబ్బందిని ప్రభావితం చేయదు. దీనితో పాటు, ఈ తొలగింపుల బాధిత ఉద్యోగులు మే 2, 2025 వరకు జీతం ఇంకా ఇతర బెనిఫిట్స్ పొందుతారు.
భారతదేశంలో స్టార్‌బక్స్
భారతదేశంలో స్టార్‌బక్స్'కి కూడా పెద్ద వ్యాపారాన్ని ఉంది. ఈ కంపెనీ దేశంలోని టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో జాయింట్ వెంచర్‌ను నడుపుతోంది. టాటా స్టార్‌బక్స్ భారతదేశంలో కాఫీహౌస్ చైన్ వ్యాపారాన్ని అక్టోబర్ 2012లో ప్రారంభించింది అలాగే వ్యాపారాన్ని విస్తరించడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. గత సంవత్సరం 2024 నాటికి ఇండియాలో 390 స్టోర్స్ ఉన్నాయి. ఇంకా 2028 నాటికి 1000 స్టోర్స్ ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications