స్టార్‌బక్స్ కొత్త సీఈఓ.. 4 నెలల్లోనే కళ్ళు చెదిరే సంపాదన.. టిమ్ కుక్ & సుందర్ పిచాయ్‌ ఇతని తరువాతే

స్టార్‌బక్స్ కొత్తగా సీఈఓగా నియమితులైన బ్రియాన్ నికోల్ గత ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ 2024 వరకు $96 మిలియన్లు పొందారు అంటే సుమారు 9 కోట్లకు పైమాటే. దింతో యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా బ్రియాన్ నికోల్ చేరారు. స్టార్‌బక్స్ హెడ్ ఆఫీస్ ఆపరేట్ చేసే సీటెల్‌లో అతని పరిహారం ప్యాకేజీలో పర్ఫార్మెన్స్ తో స్టాక్ అవార్డులు, $5 మిలియన్ల సైన్-ఆన్ బోనస్, హౌసింగ్ అలవెన్సులు ఇంకా ప్రయాణ ఖర్చులు వంటి అదనపు ప్రోత్సాహకాలు అతని లీడర్షిప్లో సంస్థ పెట్టుబడి కనబరుస్తుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, నికోల్ వేతనంలో 94 శాతం అంటే $90 మిలియన్ల కంటే పైగా స్టాక్ అవార్డుల నుండి వచ్చింది, ఇది మూడు సంవత్సరాల పర్ఫార్మెన్స్ అండ్ వెస్టింగ్ పరిస్థితుల ఆధారంగా ఉంటుంది.

స్టాక్ అవార్డులతో పాటు:
సైన్-ఆన్ బోనస్: $5 మిలియన్లు, సెప్టెంబర్ 2024లో అతని మొదటి నెల
హోసింగ్ అలవెన్స్ : $143,000, దాదాపు సగం పన్ను కవర్ చేస్తుంది.
ట్రావెల్ అలవెన్స్: $72,000; దక్షిణ కాలిఫోర్నియాలోని అతని ఇంటికి నుండి సీటెల్‌లోని స్టార్‌బక్స్ హెడ్ ఆఫీస్ మధ్య ప్రయాణాలకు
అందించింది.
$19,000 పర్సనల్ విమాన ఖర్చులు: కంపెనీ జెట్ వినియోగానికి సంబంధించినది. ఈ లెక్కలు నికోల్ మొత్తంతో కలిపి ఏడాది పరిహారం $113 మిలియన్లుగా అంచనా.

Starbucks CEO Earns Nearly 100 Million in 4 Months Surpasses Tim Cook amp amp Sundar Pichai--Details Here

బ్రియాన్ నికోల్‌ను స్టార్‌బక్స్ ఎందుకు ఎంచుకుంది
తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న లక్ష్మణ్ నరసింహన్ తర్వాత బ్రియాన్ నికోల్ నియమితులయ్యారు. వీటిలో సేల్స్ తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా బైకాట్ పిలుపులు, USలోని స్టార్‌బక్స్‌ కార్మిక సంఘాల సమస్యలు కూడా బ్రియాన్ నికోల్‌ను ఎన్నుకునేలా చేసాయి.

స్టార్‌బక్స్ నికోల్‌ను ట్రాక్ రికార్డ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన, సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించింది ఇంకా కంపెనీని తిరిగి వృద్ధిలోకి మార్గనిర్దేశం చేయడానికి అతను సరైన వ్యక్తి అని పేర్కొంది.

అమెరికా టాప్-పెయిడ్ CEOలలో
బ్లూమ్‌బెర్గ్ పే ఇండెక్స్ ప్రకారం, నికోల్ అద్భుతమైన సంపాదన USలో అత్యధికంగా వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో అతనిని 20వ స్థానంలో నిలబెట్టింది, అతని పరిహారం ఇప్పటికే పరిశ్రమ దిగ్గజాలు Apple టిమ్ కుక్, Google సుందర్ పిచాయ్ వంటి వారిని అధిగమించేల చేసింది. టిమ్ కుక్, సుందర్ పిచాయ్ 2024లో దాదాపు $75 మిలియన్లు అందుకున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అతను సంపాదించిన లీడర్షిప్ స్కిల్స్ స్టార్‌బక్స్ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి అలాగే విదేశీ మార్కెట్లలో స్టార్‌బక్స్ ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+