Star Health: కస్టమర్లకు స్టార్ హెల్త్ అదిరిపోయే ఆఫర్.. 50 నగరాల్లో అందుబాటులోకి కొత్త ఫెసిలిటీ
Health Insurance: దేశంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలువురు ప్లేయర్స్ రంగంలోకి దిగారు. దిగ్గజ LIC నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న వివిధ కంపెనీలు తమ ప్లాన్స్‌కు మెరుగు పెడుతున్నాయి. మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడేందుకు కొత్త సౌకర్యాలు అందించేందుకు వెనకాడటం లేదు.
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) ఓ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని 50కి పైగా నగరాల్లో గృహాల వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను అందిచనున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్ ఇంటి నుంచి కదలకుండా సమర్థవంతమైన ఆరోగ్య సేవలను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు ఆరోగ్య సంరక్షణ పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ, వారికి మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.

ఇంటి వద్దకే వైద్య సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా ఉన్న కేర్24, పోర్టీయా, కాల్‌హెల్త్ మరియు అతుల్య హోమ్‌కేర్ వంటి ప్రొవైడర్‌లతో కలిసి పనిచేస్తుంది. కస్టమర్లు కాల్ లేదా మొబైల్ యాప్ వినియోగించి 50కి పైగా నగరాల్లో జ్వరం, అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) మరియు అక్యూట్ గ్యాస్ట్రిటిస్‌తో సహా పలు అంటు వ్యాధులకు చికిత్స పొందవచ్చు.
ఈ పద్ధతిలో 100 శాతం నగదు రహిత హోమ్ హెల్త్ కేర్ సదుపాయాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు టోల్ ఫ్రీ నంబర్ 044-69006900కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ ప్యాకేజీ ప్రొఫెషనల్ ఫీజులు, నర్సింగ్ ఫీజులు, మెడిసిన్ మరియు ల్యాబ్ పరీక్షలు సహా అన్నీ ఇందులో కవర్ చేయపడతాయి.
'అంతకంతకూ మారుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సాంకేతికత కీలకమైన అవసరం అని మేము విశ్వసిస్తున్నాము. వినియోగదారులు ఇప్పుడు స్టార్ హెల్త్ మొబైల్ యాప్ ద్వారా అనేక రకాల అంటు వ్యాధులకు 100 శాతం నగదు రహిత గృహ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని పొందవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరలకే ఆరోగ్య సేవలను అందిస్తూ, వైద్యం విషయంలో అంతరాలను తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం' అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ MD & CEO ఆనంద్ రాయ్ తెలిపారు
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. "50కి పైగా నగరాల్లోని మా కస్టమర్‌లు మాకు కాల్ చేయడం ద్వారా లేదా స్టార్ హెల్త్ మొబైల్ యాప్ ద్వారా జ్వరం, అక్యూట్ అని పేర్కొంది. , ఈ సేవతో జేబులో ఖర్చులు లేకుండా ఉంటాయి. తక్కువ వ్యవధిలో వైద్యులు ఒకరి ఇంటి వద్దకే అందుబాటులో ఉంటారని మరియు వినియోగదారులు మందులు, రోగనిర్ధారణ పరీక్షలు మరియు ప్రత్యేక సంరక్షణను సులభంగా పొందవచ్చని బీమా కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications