Starbucks: ఫ్లైట్ లో అప్ అండ్ డౌన్ చేస్తున్న ఉద్యోగి.. జీతం కంటే ప్రయాణ ఖర్చులే ఎక్కువ..!
ప్రపంచంలో ప్రముఖ కాఫీ చైన్ కంపెనీ స్టార్ బక్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ స్థానంలో బ్రియాన్ నికోల్‌ను సీఈఓగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రియాన్ నికోల్ కు చెందిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆఫీసుకు వెళ్లేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రియాన్ నికోల్ సీటెల్ నుంచి కాలిఫోర్నియాకు అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ రెండు నగరాల మధ్య 1600 కి.మీ దూరం ప్రయాణించేందుకు ఆయన ప్రైవేట్ జెట్‌ను ఉపయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా కంపెనీ తన రోజువారీ కార్యాలయానికి వెళ్లేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంది. స్టార్‌బక్స్ తన CEO కోసం చేసిన ఏర్పాట్లను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. స్టార్‌బక్స్ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, బ్రియాన్ నికోల్ సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వారానికి 3 రోజులు పని చేయాల్సి ఉంటుంది.

అతని ఇల్లు కాలిఫోర్నియాలో ఉన్నందున, అతను వారానికి కనీసం 3 రోజులు అక్కడికి వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల కంపెనీ తన ఆఫర్ లెటర్‌లో ప్రైవేట్ కార్పొరేట్ జెట్ కోసం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ హైబ్రిడ్ పని విధానం స్టార్‌బక్స్‌లో 2023 సంవత్సరం నుంచి అమలులో ఉంది. 50 ఏళ్ల సీఈఓ బ్రియాన్ నికోల్‌పై కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓగా ఉన్నప్పుడు, ఆయన కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన నాయకత్వంలో కంపెనీ స్టాక్ కూడా భారీగా వృద్ధి చెందింది.
స్టార్‌బక్స్ ఒప్పందం ప్రకారం బ్రియాన్ నికోల్ వార్షిక వేతనం 1.6 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కాకుండా అతనికి 36 లక్షల డాలర్ల నగదు బోనస్, 72 లక్షల డాలర్ల పనితీరు బోనస్ కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా అతను $23 మిలియన్ల వార్షిక ఈక్విటీకి కూడా అర్హత సాధించారు. చూడాలి బ్రియాన్ నికోల్ కంపెనీని ఏ స్థాయికి తీసుకెళ్తాడో..


Click it and Unblock the Notifications