Bitcoin: క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త.. లక్ష డాలర్లకు చేరుకోనున్న బిట్‌కాయిన్.. పూర్తి వివరాలు
Bitcoin News: ఒకప్పుడు భారతదేశంలో క్రిప్టో కరెన్సీలు ఒక వెలుగు వెలిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీటిపై ఉక్కుపాదం మోపటంతో ప్రజాదరణను కోల్పోయాయి. అలాగే కొందరు వీటిని నమ్ముకుని లక్షల్లో అప్పులపాలయ్యారు.
ఇలాంటి తరుణంలో క్రిప్టోల్లో ఎక్కువ ఫేమస్ అయిన బిట్‌కాయిన్ గురించి తాజాగా ఒక శుభవార్త ఉంది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన స్టాండర్డ్ ఛార్టర్డ్ బిట్ కాయిన్ పై తన అంచనాలను ప్రకటించింది. 2024 నాటికి క్రిప్టో స్పింగ్ మధ్య ఒక్కో బిట్ కాయిన్ ధర లక్ష డాలర్ల మార్కును అందుకుంటుందని తన బులిష్ వ్యూ విడుదల చేసింది.

అమెరికాలో బ్యాంకింగ్ రంగం ఆటుపోట్ల నడుమ బిట్ కాయిన్ డీసెంట్రలైజ్డ్ అసెట్ రూపంలో నిలుస్తుందని బ్యాంక్ నమ్ముతోంది. 2024లో బిట్‌కాయిన్ మైనింగ్ రివార్డ్‌లను సగానికి తగ్గించడానికి, సరఫరాను నియంత్రించడానికి రూపొందించిన విధానం వల్ల ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుందని జియోఫ్ కేండ్రిక్ నేతృత్వంలోని స్టాండర్డ్ చార్టర్డ్ బృందం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
2023లో బిట్‌కాయిన్ బలమైన పనితీరు కారణంగా 130% పెరుగుదలను చూసింది. అలాగే క్రిప్టో కరెన్సీల్లో పెరుగుతున్న తన మార్కెట్ ఆధిపత్యం కారణంగా ఏప్రిల్ నుంచి 45-50 శాతం మేర ధర పెరుగుదలను నమోదు చేసింది. ఇది బ్యాంక్ ఆశావాద సూచనకు మద్దతునిస్తోంది. యూఎస్ స్పాట్ ఈటీఎఫ్‌ల ప్రారంభ పరిచయం కారణంగా బిట్‌కాయిన్ ఏడాది ముగిసేలోపు 1,00,000 డాలర్ల ధర మైలురాయిని చేరుకోవచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌కు పరివర్తనాత్మక కాలాన్ని సూచించటం ఆసక్తికి పెరుగుదలకు కారణంగా ఉంది.
Note: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు భారీ నష్టాలు, ఒడిదొడుకులతో కూడుకున్నవి. వీటిలో పెట్టుబడులు చేసే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. తొందరపడి ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు.


Click it and Unblock the Notifications