Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
Adani Bonds: క్రెడిట్ సూయిస్, సిటీ గ్రూప్ బాటలోనే మరో అంతర్జాతీయ బ్యాంకు అదానీ బాండ్లను అంగీకరించేందుకు విముకత చూపింది. హిండెన్ బర్గ్ నివేదిక సృష్టిస్తున్న అల్లకల్లోతం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ సీనియర్ ఉద్యోగి వెల్లడించారు.

స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్..
బ్రిటన్ కు చెంది ప్రఖ్యాత స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అదానీ గ్రూప్ కు చెందిన డాలర్ బాండ్లను అంగీకరించటాన్ని నిలిపివేసింది. అయితే ప్రస్తుతం బ్యాంక్ తక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ అదానీ బాండ్లను కొలేటరల్ సెక్యూరిటీలుగా అంగీకరించటాన్ని నిలిపివేయటం తాత్కాలిక నిర్ణయంగా తెలుస్తోంది.

భద్రతలో భాగంగా..
ప్రస్తుతం బ్యాంక్ తీసుకున్న ఈ చర్యలు కేవలం రక్షణ చర్యల్లో భాగమని, దీని ద్వారా తమ బ్యాంకుతో పాటు ఖాతాదారుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. పరిస్థితులు ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉండటంతో విదేశీ బాండ్ల ద్వారా ఫండ్స్ సేకరించాలని ఇటీవల అదానీ గ్రూప్ ఆలోచించినప్పటికీ వెనక్కి తగ్గింది. దీనికి ముందు రూ.20,000 కోట్లతో ఎఫ్పీవో నిర్వహించి పూర్తిచేసినప్పటికీ.. నైతిక బాధ్యతగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల అదానీ ఒక వీడియో విడుదల చేస్తూ వెల్లడించారు.

అదానీ నిర్ణయం..
షేర్లను తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల విషయంలో గౌతమ్ అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి రూ.7000-రూ.8000 కోట్లను ముందుగానే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా చాలా పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు. రానున్న 30-45 రోజుల్లో షేర్ల తాకట్టు ద్వారా తీసుకున్న అప్పులను సున్నాకు తీసుకురావాలని అదానీ నిర్ణయించినట్లు సమాచారం.

పెరుగుతున్న ఒత్తిడి..
రేటింగ్ ఏజెన్సీలతో సహా అదానీ గ్రూప్ కంపెనీల్లోని పెట్టుబడిదారులు, గవర్నెన్స్ కారణాలపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో షేర్ల ధరల స్థిరీకరణ, అధిక ఓలటాలిటీని తగ్గించేందుకు అదానీ గ్రూప్ చర్యలు చేపడుతోంది. అయితే ఈ ఓలటాలిటీకి సంబంధించిన వ్యవహారాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల ఆర్బీఐ కూడా వెల్లడించింది. ఈ రోజు కూడా అదానీ కంపెనీ షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications