Stallion India IPO: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలు వరుసగా ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ గెయిన్స్ తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకుల కంటే ఒక్కసారిగా ఇలా లాభం పొందటంపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. కానీ షేర్లు అలాట్ అయిన వారికి మాత్రం సూపర్ గెయిన్స్ వస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు స్టాక్ మార్కెట్లో జాబితా అయిన స్టాలియన్ ఇండియా ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో జాబితాను నమోదు చేసింది. ముందుగా బీఎస్ఈలో స్టాక్ 34 శాతం ప్రీమియం ధర రూ.120 వద్ద ఎంట్రీ ఇవ్వగా ఇదే రేటు వద్ద కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో కూడా అరంగేట్రం చేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో తొలిరోజే లాభాల కోలాహలం కొనసాగుతోంది.

ఐపీవోకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే కంపెనీ ఇష్యూ ద్వారా రూ.199.45 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.160.73 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 0.43 కోట్ల షేర్ల విక్రయం ద్వారా పొందింది. ఇందులో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.59.84 కోట్లను సమీకరించింది. వాస్తవానికి కంపెనీ రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం ఐపీవోను జనవరి 16 నుంచి 20 వరకు తెరచి ఉంచింది.
కంపెనీ ఇష్యూ కోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.85-90గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాట్ పరిమాణాన్ని 165 షేర్లుగా ఫిక్స్ చేయటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.14,850 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఐపీవో ఇష్యూ సమయంలో పెట్టుబడిదారుల నుంచి మంచి రెస్పాన్స్ చూడటంతో 189 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. దీంతో ప్రమోటర్ల షేర్ హోల్డింగ్ 94.63 శాతం నుంచి 67.90 శాతానికి పడిపోయింది.
కంపెనీ వ్యాపారం..
2002లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా రెఫ్రిజరేటర్లు, పరిశ్రమలు ఉపయోగించే గ్యాస్ ఉత్పత్తుల విక్రయ వ్యాపారంలో కొనసాగుతోంది. కంపెనీ ప్రాథమిక వ్యాపారంలో రిఫ్రిజిరేటర్, పారిశ్రామిక వాయువులను డీబల్కింగ్, బ్లెండింగ్ అండ్ ప్రాసెసింగ్, ముందే నింపిన డబ్బాలు మరియు చిన్న సిలిండర్లు, కంటైనర్ల అమ్మకం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి మహారాష్ట్రంలో 2, హర్యాణాలో 1, రాజస్థాన్ రాష్ట్రంలో ఒకటి చొప్పున ప్లాంట్లు ఉన్నాయి.
ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని ఏపీ, మహారాష్ట్రలో కొత్త వ్యాపార విస్తరణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. అలాగే కొంత భాగాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించనుందని తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications