AI: IT ఉద్యోగుల్లో AI గుబులు.. మరో ఐదేళ్లలో నో ప్రోగ్రామర్స్, మొబైల్స్‌లో నో ఇంటర్నెట్!
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాల్లోకి ఎంతలా చొచ్చుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్తులో లక్షల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే AI రాకతో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరికొందరి వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో 'స్టెబిలిటీ AI' CEO చేసిన వ్యాఖ్యలు IT ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి.
భవిష్యత్తులో AI పరివర్తన, వినియోగం ఎలా ఉండబోతోంది అనే విషయంపై స్టెబిలిటీ AI CEO ఎమాడ్ మోస్టాక్ మాట్లాడారు. ChatGPT వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ఇప్పటికే కోడింగ్ చేస్తున్నందున.. రాబోయే ఐదేళ్లలో మానవ ప్రోగ్రామర్ల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ప్రతి ఫోన్ లో ChatGPT అందుబాటులో ఉంటందని అంచనా వేశారు.

ప్రముఖ కోడ్ మేనేజర్ 'గిట్ హబ్'లోని మొత్తం కోడ్ లో 41 శాతం AI ద్వారా రూపొందినదేనని మోస్టాక్ అభిప్రాయపడ్డారు. ఏ సంస్థ AIని నియంత్రించకూడదని, ఇది మాన హక్కు అని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. Nvidia CEO జెన్సన్ హువాంగ్ సైతం.. AI ప్రతి రంగానికీ విస్తరిస్తుందని ఇటీవల ఉద్ఘాటించారు. పెరుగుతున్న సాంకేతికత ద్వారా ఎవరైనా ప్రోగ్రామర్ కావచ్చన్నారు.
OpenAI అభివృద్ధి చేసిన విప్లవాత్మక ChatGPT.. ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కోడింగ్ నుంచి కంటెంట్ వరకు, సంగీతం నుంచి కవిత్వం వరకు ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ తరహా ఉత్పదక AI వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, వాటి వెన్నంటే ఆందోళనలు సైతం తీవ్రమవుతున్నాయి. మానవ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందనే భయాలు సర్వత్రా నెలకొన్నాయి.
తమ కంపెనీ ఉద్యోగులు కోడ్ రాయడానికి ChatGPTని ఉపయోగిస్తున్నందున.. నెలల సమయం పట్టే పని ఇప్పుడు వారాల్లో పూర్తవుతుందని సాఫ్ట్‌వేర్ కంపెనీ 'ఫ్రెష్‌వర్క్స్ ఎంప్లాయీస్' CEO ఇటీవల వెల్లడించారు. 'మేము కోడ్‌ని వ్రాయడానికి ChatGPTని ఉపయోగిస్తాము. దాదాపు 8-10 వారాలు పట్టే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇప్పుడు కేవలం వారం కంటే తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయగలుగుతున్నాం' అని CEO గిరీష్ మాతృభూతం తెలిపారు.


Click it and Unblock the Notifications