SRM Contractors IPO: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లోకి రెండు ఐపీవోలు అడుగుపెట్టాయి. మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నప్పటికీ లిస్ట్ అయిన ఐపీవోలు మాత్రం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి.
ముందుగా మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లో లిస్టింగ్ శుభారంభం చేసిన ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ కంపెనీ గురించే. SRM కాంట్రాక్టర్స్ కంపెనీ షేర్లు BSEలో ఒక్కోటి రూ.225 వద్ద జాబితా చేయబడ్డాయి. వాస్తవానికి ఇన్వెస్టర్లు ఐపీవోలో షేర్లను రూ.210 ధరకి పొందారు. SRM కాంట్రాక్టర్స్ షేర్లు సుమారు 7 శాతం ప్రీమియంతో BSEలో జాబితా చేయబడ్డాయి. అదే సమయంలో కంపెనీ షేర్లు 2.5 శాతం ప్రీమియంతో NSEలో రూ.215.25 రేటు వద్ద లిస్ట్ చేయబడ్డాయి.

కంపెనీ ఐపీవో మార్చి 26న రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి మార్చి 28న ముగిసింది. నేడు స్టాక్ మార్కెట్లలో జాబితా అయిన ఐపీవో షేర్లు కొద్దిసేపటికే ప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో బీఎస్ఈలో రూ.236.20కి చేరుకోగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.226కి చేరాయి. ఈ క్రమంలో కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.130.20 కోట్లను సమీకరించింది. ఐపీవో జాబితాకు ముందర కంపెనీలో ప్రమోటర్లకు 99.92 శాతం వాటా ఉండగా.. ప్రస్తుతం అది 72.92 శాతానికి తగ్గింది.
SRM కాంట్రాక్టర్స్ ఐపీవో మొత్తం 86.57 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 46.97 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 214.94 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారు కోటా 59.59 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 70 షేర్లుగా ఉంచింది. ఐపీవోలో బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు కనీసం రూ.14,700 పెట్టుబడిగా పెట్టారు. 2008లో స్థాపించబడిన కంపెనీ.. రోడ్లు, వంతెనలు, సొరంగాలు, వాలు స్థిరీకరణ పనులు, ఇతర నిర్మాణ సంబంధిత పనుల్లో డీల్ చేసే నిర్మాణ & అభివృద్ధి సంస్థ.


Click it and Unblock the Notifications