IPO News: ఆగస్టు 7న ప్రారంభమౌతున్న ఐపీవో.. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే..?
IPO News: గడచిన రెండు నెలలుగా దేశంలో ఐపీవోలు భారీగా మార్కెట్లలోకి వస్తున్నాయి. వీటిలో ఫెయిల్ లేదా నిరాశకు గురిచేసిన వాటి సంఖ్య చాలా తక్కువ.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది శ్రీవారి స్పైసెస్ ఐపీవో గురించి. ఇది ఆగస్టు 7న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. దీంతో వచ్చే వారం రిటైలర్లు బెచ్ చేసేందుకు మరో ఐపీవో అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ IPO ఆగస్ట్ 9 వరకు మాత్రమే ఇన్వెస్టర్ల కోసం తెరిచి ఉంటుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.9 కోట్లను సమీకరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో షేర్లు గ్రే మార్కెట్లో మంచి స్పందనను చూస్తున్నాయి.

శ్రీవారి స్పైసెస్ ఐపీవోలో ఒక్కో షేరు ధరను రూ.40 నుంచి రూ.42గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకునే వారి కోసం లాట్ సైజ్ 3000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. దీని కారణంగా పెట్టుబడిదారుడు కనీసం రూ.1,26,000 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. శ్రీవారి స్పైసెస్ ఐపీవో షేర్ల కేటాయింపు ఆగస్టు 14, 2023న జరుగుతుంది. అలాదే కంపెనీ లిస్టింగ్ ఆగస్టు 18, 2023న NSMEలో జరగనుంది.
కంపెనీ ఐపీవోకు GYR క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ IPO కోసం రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. శ్రీవారి స్పైసెస్ నికర ఆదాయం రూ.35.83 కోట్లుగా ఉంది. FY2023లో కంపెనీ నికర లాభం రూ.3.13 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో బ్రోకరేజ్ అంచనాల ప్రకారం కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం ఒక్కో షేరుపై రూ.23గా ఉన్నట్లు వెల్లడైంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కంపెనీ లిస్టింగ్ నాటికి ఒక్కో షేర్ ధర రూ.65కి చేరవచ్చు. లిస్టింగ్‌కి ముందు ఇది మంచి సంకేతంగా పరిగణించబడుతోంది.


Click it and Unblock the Notifications