Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవల ఒడిదొడుకుల సమయంలోనూ ఒక మల్టీబ్యాగర్ తళుక్కున మెరుస్తోంది. వాస్తవానికి మధ్యస్థ కాలంలోనే కంపెనీ తన పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించింది. కొంచెం సమయం వెచ్చించి పెట్టుబడిదారులు సెర్చ్ చేస్తే క్వాలిటీ మల్టీబ్యాగర్లు దొరుకుతుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీరామ్ పిస్టన్ & రింగ్స్ కంపెనీ షేర్ల గురించే. ఈ స్టాక్ గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు ఏకంగా 157 శాతం రాబడిని అందించింది. అలాగే రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 500 శాతం కంటే ఎక్కువ ర్యాలీని నమోదు చేసింది. మహమ్మారి కారణంగా ఏర్పడిన మందగమనం తర్వాత భారతదేశ ఆటోమొబైల్ రంగం బలమైన పునరాగమనం చేసింది. ఈ పరిస్థితులు శ్రీరామ్ పిస్టన్ & రింగ్స్ షేర్లకు ప్రయోజనం చేకూర్చాయి. అలాగే గణాంకాల ప్రకారం నాలుగో త్రైమాసికంలో దేశీయంగా ప్రయాణీకుల వాహన విక్రయాలు నమోదయ్యాయి.

గ్రామీణ మార్కెట్‌లో రికవరీ కారణంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు వృద్ధి చెందడంతోపాటు 200సీసీ విభాగంలో బైక్‌లకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ఇవి పరోక్షంగా ఆటో విడిభాగాలకు బలమైన డిమాండ్‌కు దోహదపడ్డాయి. అలాగే ఆఫ్టర్ సేల్ విక్రయాలు, ఎగుమతుల పెరుగుదల ఆటో విడిభాగాల వాల్యూమ్‌లను మరింత పెంచాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర గడచిన ఏడాది రూ.802.95 స్థాయి నుంచి పెరిగి రూ.2,067 స్థాయిలకు 157 శాతం పెరిగాయి. ఇక రెండేళ్ల కాలంలో కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే 512 శాతం, నాలుగేళ్లలో 654 శాతం మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.
ఈ క్రమంలో కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. శ్రీరామ్ పిస్టన్ & రింగ్స్ దేశంలో పిస్టన్‌లు, పిస్టన్ పిన్స్, పిస్టన్ రింగ్స్, ఇంజన్ వాల్వ్‌ల తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది. దేశంలో 1,200కి పైగా టచ్‌పాయింట్లు, విస్తృతమైన సర్వీసింగ్ నెట్‌వర్క్‌తో సహా 45 దేశాల్లో కంపెనీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ OEM, ఆఫ్టర్ మార్కెట్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా గుర్తింపు పొందింది.
గతవారం కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీని తర్వాత స్టాక్ 5 శాతం కంటే ఎక్కువగా లాభపడింది. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 12.6% వృద్ధి చెంది రూ.802 కోట్లకు చేరుకుంది. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14.5% వార్షికంగా వృద్ధి చెంది రూ.3,351 కోట్లకు చేరుకుంది. Q4FY24లో పన్ను తర్వాత ఆదాయం 30.2% పెరిగి రూ.120 కోట్లకు చేరుకుంది. అలాగే పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.446 కోట్లుగా నమోదైంది. ఇది గడచిన ఆర్థిక సంవత్సం మెుత్తం నికర లాభం రూ.295 కోట్ల కంటే 51.2 శాతం అధికం కావటం గమనార్హం.


Click it and Unblock the Notifications