Srilanka: పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాళా తీసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దానిని ఆదుకోవడానికి భారత్ సైతం G20 సమ్మిట్ లో తన వంతు ప్రయత్నం చేసింది. రుణాలను రీషెడ్యూల్ చేసి కొంత మేరకు అప్పుల్లో ఉపశమనాన్ని సైతం ఇచ్చింది. తాజాగా ఇండియా క్రెడిట్ లైన్‌లో కొంత భాగాన్ని ఆ దేశం తిరిగి చెల్లించింది.
మొదటి విడత బెయిలౌట్ తోనే..
అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) నుంచి 330 మిలియన్ డాలర్లను మొదటి విడత బెయిలౌట్‌ను శ్రీలంక తాజాగా అందుకుంది. ఇండియా క్రెడిట్ లైన్‌లో స్వల్ప భాగాన్ని తిరిగి చెల్లించడానికి దీనిలో కొంత మొత్తాన్ని ఉపయోగించింది. ఇందుకోసం 120 మిలియన్ డాలర్లను వినియోగించినట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి రంజిత్ సియంబలపిటియా మీడియాకు తెలిపారు.

రుణాల చెల్లింపునకు ప్రాధాన్యం:
"ఔషధాలు, ఇంధనం సహా పలు నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి లంకకు భారత్ ఇటీవల రుణాలను ఇచ్చింది. దానిలో కొంత భాగాన్ని మేము గురువారం తిరిగి చెల్లించాము" మంత్రి పేర్కొన్నారు. అప్పుల చెల్లింపునకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రుణాలను రీషెడ్యూల్ చేసి IMF నుంచి బెయిలౌట్ పొందడానికి శ్రీలంకకు భారత్ సహాయం చేసింది.
సంక్షోభం వేళ భారత్ సాయం:
గతేడాది ఏప్రిల్‌లో తన రుణాలను ఎగవేసిన అనంతరం క్రెడిట్ లైన్లతో సహా 4 బిలియన్ డాలర్లకు మించి ఆర్థిక సహాయాన్ని శ్రీలకంకు ఇండియా అందించింది. తద్వారా 48 నెలల వ్యవధిలో తిరిగి చెల్లింపు షరతులతో కూడిన రుణాన్ని IMF పొందగలిగింది. ఆహారం, ఇంధనం మరియు ఔషధాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ప్రజలు వీధుల్లోకి వచ్చిన వేళ భారత్ సహాయం అందించడాన్ని ఆదేశం కొనియాడింది.


Click it and Unblock the Notifications