మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక, వాణిజ్య పరిస్థితులు రోజులు గడిచేకొద్దీ క్షీణిస్తూనే ఉన్నాయి. ద్వీప దేశంలోని కొత్త ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో అనేక ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ-ప్రాయోజిత వస్తువుల ధరలను పెంచేసింది. తాజాగా విద్యుత్ ఛార్జీలను 75 శాతం పెంచేందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మంగళవారం ఆమోదం తెలపటం విస్మయానికి గురిచేస్తోంది.

విద్యుత్ ఛార్జీలు..
శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ (PUCSL) ఛైర్మన్ జనక రతనాయకే మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రజలు, ఇతర వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయమైన విద్యుత్ టారిఫ్‌ను ఆమోదించాలని కమిషన్ నిర్ణయించింది. శ్రీలంక విద్యుత్ బోర్డు (CEB) దీనికి అనుమతించింది. PUCSL డేటా ప్రకారం.. 2013 తర్వాత అత్యధికంగా విద్యుత్ టారిఫ్ 75% పెరగడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.

PUCSL అధ్యక్షుడు జనక రత్నయ్య..
విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆగస్టు 10 నుంచి అమల్లోకి వస్తుందని పీయూసీఎస్‌ఎల్ అధ్యక్షుడు జనక రత్నాయకే శ్రీలంక మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇప్పటికే ఆదాయం, ఉపాధి లేకుండా అలమటిస్తున్న లక్షలాది లంక ప్రజలపై భారాన్ని మోపుతుంది.

0- 30 యూనిట్లు..
తాజా ప్రకటన ద్వారా.. శ్రీలంకలోని 0-30 యూనిట్ల వినియోగదారులకు ఆగస్టు 10 నుంచి 264% విద్యుత్ టారిఫ్‌ను పెంచేందుకు CEBకి అనుమతి లభించింది. దీంతో గరిష్ఠంగా రూ.198 ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది.

ఇతర శ్లాబ్లపై పెంపు ఇలా..
31 నుంచి 60 యూనిట్లు ఉన్న వినియోగదారుల బిల్లులు 211 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.599, 61-90 యూనిట్లపై 125 శాతం, 91-120 యూనిట్లపై 89 శాతం, 121 నుంచి 180 యూనిట్లపై 79 శాతం పెరుగుదల ఉంటుందని పీయూసీఎస్‌ఎల్ ఛైర్మన్ తెలిపారు.

డాలర్లలో చెల్లింపులు..
విదేశీ మారకం ద్వారా ఆదాయంలో 60 శాతానికి పైగా ఆర్జిస్తున్న.. పారిశ్రామిక, హోటల్ రంగాల్లోని విద్యుత్ వినియోగదారులు US డాలర్లలో విద్యుత్ బిల్లులను చెల్లించాలి. ఈ పథకం కింద కవర్ చేయబడిన వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులపై 1.5% తగ్గింపు పొందుతారు.
ఈ స్కీమ్ సెప్టెంబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.

హోటళ్లపై భారీగా..
ఆగస్ట్ 10, 2022 నుంచి హోటల్ తరహా వినియోగదారులకు 50% టారిఫ్ పెంపు విధించబడుతుందని, మిగిలిన 50% నవంబర్ 10, 2022 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తన ప్రకటనలో వెల్లడించారు. అంటే రానున్న కాలంలో పర్యాటక రంగంపై భారం పెరగనుంది. విదేశీ ప్రయాణికులకు హోటళ్లలో బస నుంచి మిగిలిన ఖర్చులు సైతం భారీగానే పెరుగుతాయని తెలుస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications