Zoho News: జోహో సీఈవో పదవికి శ్రీధర వెంబు రాజీనామా.. కొత్తగా ఆ పనిలోకి, ఏఐ ఎఫెక్ట్!
Zoho Sridhar Vembu: ఇటీవలి కాలంలో ఏఐ రాక సామాన్య ప్రజలతో పాటు కంపెనీల ప్రతినిధులపై కూడా భారీ ప్రభావాన్నే చూపిస్తోంది. ఈ క్రమంలో మారిపోతున్న వ్యాపారాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు తీసుకురాలేక పోవటంతో చాలా కంపెనీలు వెనుకపడుతుండగా.. మరికొందరు మాత్రం కాలంతో పాటు పరిగెత్తటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
కార్పొరేట్ ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసిన అంశం జోహో కార్ప్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు రాజీనామా. ఇప్పటి వరకు కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న శ్రీధర్ తాజాగా తన రాజీనామాను సమర్పించటం పెద్ద చర్చకు దారితీసింది. అయితే తాను కంపెనీని వీడి బయటకు వెల్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా కంపెనీ 'చీఫ్ సైంటిస్ట్'గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

శ్రీధర్ వెంబు క్లౌడ్-ఆధారిత వ్యాపార సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే ప్రైవేట్ టెక్ సంస్థ అయిన జోహో వ్యవస్థాపకుల్లో ఒకడు, కంపెనీకి సీఈవో. శ్రీధర్ తో పాటు ఆయన ఇద్దరు తోబుట్టువులు జోహోలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. వెంబు ప్రిన్స్‌టన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టాను పొందారు. అతని సంస్థ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రైవేట్ యాజమాన్య సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీధర్ వెంబు నికర విలువ దాదాపు 5.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం.
ఇకపై శ్రీధర్ వెంబు జోహోలో రీసెర్చ్ అండ్ డెవల్మెంట్ పై దృష్టి సారించనున్నట్లు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు. తన కొత్త బాధ్యతలు నేటి నుంచే ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. కంపెనీ విపరీతంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికత వల్ల కంపెనీలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, అయితే ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. తాను వ్యక్తిగత గ్రామీణాభివృద్ధి మిషన్‌ను కొనసాగిస్తున్నప్పుడు R&D కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ఉత్తమమని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
శ్రీధర్ వెంబు రాజీనామాపై జోహో కార్పొరేషన్ అధికారికంగా స్పందించింది. వెంబు కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి చీఫ్ సైంటిస్ట్‌గా కొత్త పాత్రలోకి వెళుతున్నట్లు వెల్లడించింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు శైలేష్ కుమార్ డేవి కొత్త గ్రూప్ CEOగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో మరో సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్ కంపెనీ అమెరికా విభాగాని నాయకత్వం వహిస్తారని వెల్లడించింది. ఇదే క్రమంలో మణి వెంబు జోహో.కామ్ విభాగానికి నాయకత్వం వహిస్తారని వెల్లడైంది.


Click it and Unblock the Notifications