కొలంబో: పొరుగుదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే శ్రీలంక కరెన్సీ మారకం విలువ అమాంతం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. దీన్ని నివారించడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ ఫలించట్లేదు. అదే సమయంలో రాజకీయ సంక్షోభం సైతం నెలకొంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సెపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అక్కడి ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్షం సమగి జన బల్వేగయా పార్టీ అగ్రనాయకత్వం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.

700 బేసిక్ పాయింట్లు పెంపు
అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను చవి చూస్తోంది. ఈ పరిణామాల మధ్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వడ్డీరేట్లను రెట్టింపు చేసింది. వాటిని డబుల్ చేసింది. బేసిక్ పాయింట్లను 700 మేరకు పెంచింది. కీలక రంగాలకు వాటిని వర్తింపజేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వడ్డీరేట్లను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు, మార్కెటీర్లలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినట్టవుతుందని సెంట్రల్ బ్యాంక్ భావిస్తోంది.

ద్రవ్యోల్బణం కట్టడికి..
ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, విద్యుత్, ఆహారం, మందులు.. వంటి రంగాలకు సంబంధించిన దిగుమతులపై డబ్బులను చెల్లించే స్థోమత కూడా లేదు శ్రీలంకకు. పరిమిత వనరులతోనే నెట్టుకొస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగడాన్ని నిరసిస్తూ లంకేయులు వీధుల్లో ప్రదర్శనలను సైతం నిర్వహిస్తోన్నారు. అవికాస్తా హింసాత్మకంగానూ రూపుదాల్చుతున్నాయి. రాజకీయ రంగును పులుముకున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మానిటరీ బోర్డు సమావేశమైంది.

వడ్డీరేట్లు రెట్టింపు..
స్టాండింగ్ లెండింగ్ ఫెసిలిటీని 14.50, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని 13.50 శాతానికి పెంచింది. వడ్డీ రేట్లను రెట్టింపు చేయడం ద్వారా- త్వరలోనే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామనే ఓ సానుకూల సందేశాన్ని ఇన్వెస్టర్లు, మార్కెటీర్లకు పంపించినట్టయిందని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పీ నందలాల్ వీరసింఘె తెలిపారు. సెంట్రల్ బ్యాంక్‌పై ఎలాంటి బయటి శక్తుల ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసే విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు.

గుడ్డిగా నిర్ణయాలను తీసుకోలేం..
దేశంలో నెలకొన్న పరిణామాలు అనేక సవాళ్లను విసురుతున్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తమపై ఉందని, దానికి అనుగుణంగానే తాము చర్యలు తీసుకుంటున్నామని వీరసింఘే అన్నారు. సంక్షోభ సమయంలో గుడ్డిగా నిర్ణయాలను తీసుకోలేమని, అన్నీ ఆలోచించిన తరువాతే ముందడుగు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆర్థిక వాహనం ప్రమాదానికి గురి కాకముందే బ్రేకులను వేయాల్సిన బాధ్యతను తాము తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తాము వడ్డీ రేట్లను రెట్టింపు చేయాల్సి వచ్చిందని నందలాల్ వీరసింఘె వివరించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications