Penny Stock: కోటీశ్వరులను చేసిన రూ.2 స్టాక్.. ఏడు నెలల్లోనే మారిన ఇన్వెస్టర్ల తలరాత
Crorepati Stock: అందరూ మార్కెట్లో వెంపర్లాడేది సరైన పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసమే. అయితే వీటిని ఎంత వేగంగా గుర్తిస్తే అంత లాభాలను అందుకోవచ్చు. ఇవి తక్కువ కాలంలోనే వేలను లక్షలుగా, లక్షలను కోట్లుగా మార్చేస్తుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది తక్కువ కాలంలోనే పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్ శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ గురించే. శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ షేర్లు గత కొన్ని సెషన్‌లుగా నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్ దాదాపు 11,000% రాబడిని అందించి ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తోంది. ఈ కాలంలో ఒక్కో షేరు ధర రూ.2.90 నుంచి ప్రస్తుత ధర రూ.319.78కి పెరిగింది. అంటే లక్ష రూపాయల పెట్టుబడి 7 నెలల్లో కోటి రూపాయలకు మార్చేసింది.

శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ షేర్లు గత ఆరు నెలల్లో 8,427.47% లాభపడింది. ఈ సమయంలో ఒక్కో షేరు ధర రూ.3.75 నుంచి ప్రస్తుత స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 23,587.41% లాభపడింది. ఏడాదిలోపే ఈ షేరు రూ.1.35 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. ఐదేళ్లలో స్టాక్ 14,000% పెరిగింది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట ధర ఎన్ఎస్ఈలో రూ.319.78గా ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 41.25 వద్ద ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.799.89 కోట్లుగా ఉంది.
ఇది ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ టెలివిజన్ నెట్‌వర్క్ కంపెనీ. శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ 1994లో స్థాపించబడింది. ఇది ఒక మీడియా సంస్థ, వివిధ ప్రసారకర్తలు, అగ్రిగేటర్‌లు, శాటిలైట్ నెట్‌వర్క్‌ల కోసం కంటెంట్ ఉత్పత్తి, కంటెంట్ సిండికేషన్ వ్యాపారంలో కొనసాగుతోంది. బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.323.70 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications