Multibagger Stock: మనందరం మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో చూసే ఉంటాం. అక్కడ గెలవటానికి సరైన విజ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం లాంటి ఇతర అంశాలు చాలా ముఖ్యం. అదే విధంగా మనం స్టాక్ మార్కెట్లో మంచి లాభాలను పొందాలన్నా దానికి నిరీక్షణతో పాటు కొంత హోమ్ వర్క్ అవసరం. అప్పుడే మీరు కూడా కోటీశ్వరులుగా మారవచ్చు. అలా ఇన్వెస్టర్లకు బంగారం లాంటి లాభాలు కురిపించిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకోండి.

స్టాక్ వివరాలు..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఓపిక అవసరం. మీరు ఫండమెంటల్స్ చూసి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే.. లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు పొందగలరు అనటానికి ఈ కంపెనీ స్టాక్ సరైన ఉదాహరణ. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది SRF లిమిటెడ్ స్టాక్ గురించే. కంపెనీ గత ఏడాది పొజిషనల్ ఇన్వెస్టర్లకు బోనస్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు కంపెనీ పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం?

పెట్టుబడిపై రాబడి ఇలా..
శుక్రవారం కంపెనీ షేరు మార్కెట్‌లో 2.30 శాతం క్షీణించి రూ.2,604.90 వద్ద ముగిసింది. జనవరి 01, 1999న కంపెనీ షేరు ధర రూ.2.06 వద్ద ఉంది. అంటే.. గత 23 సంవత్సరాల్లో SRF లిమిటెడ్ వాటాలో 1,26,351.46 శాతం పెరుగుదల నమోదైంది. అందుకే మంచి కంపెనీ షేర్లలో దీర్ఘకాలం పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు ఎప్పుడూ సూచిస్తూనే ఉంటారు.

లక్షలను కోట్లుగా మార్చిన వైనం..
కంపెనీ గతేడాది ఒక షేరుపై 4 షేర్లను బోనస్‌గా అందించింది. ఎవరైనా ఇన్వెస్టర్ జనవరి 01, 1999న లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. 2021 ప్రారంభంలో అతని రాబడి రూ. 5.74 కోట్లకు పెరిగింది. అదే విధంగా సదరు పెట్టుబడిదారుడు దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.50.57 కోట్లకు చేరుకునేది. కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించటం పెట్టుబడిదారుల తలరాతను ఒక్కసారిగా మార్చేసింది. అంటే 1999 ప్రారంభంలో ఈ స్టాక్‌పై లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రూ. 50 కోట్లకు పైగా రాబడి వచ్చి ఉండేది.

కంపెనీ వ్యాపారం..
SRF Ltd కంపెనీ ఫ్లోరోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫిల్మ్స్ ప్యాకేజింగ్, టెక్నికల్ టెక్స్‌టైల్స్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. భారత్‌తో సహా 75 దేశాల్లో కంపెనీ కంపెనీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో థాయిలాండ్, దక్షిణాఫ్రికా, హంగేరీ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.77,159.38 కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications