Multibagger Stock: స్టాక్ మార్కెట్లో ఒక విషయం సాధారణం. అదేంటంటే.. ఇక్కడ పెట్టుబడి పెట్టాక సహనంతో ఇన్వెస్ట్ మెంట్లను కొనసాగించడం చాలా ముఖ్యం. ఒక పెట్టుబడిదారుడు ఫండమెంటల్స్‌ని చూసి కంపెనీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలి. అలా చేసే వారికి దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రాబడులు తప్పక వస్తాయి. సరైన నిర్ణయం వెంటనే ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ సరైన దారిలోనే కొనసాగటం వల్ల తప్పక మంచి రిటర్న్స్ రావటం మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్స్ తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మారుస్తుంటాయి.

కంపెనీ వ్యాపారం..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో లిమిటెడ్ కంపెనీ గురించే. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు హెడ్ ఆఫీస్ గా ఈ కంపెనీ పనిచేస్తోంది. కంపెనీ మోనోక్లోరో ఎసిటిక్ యాసిడ్ ఫ్రంట్-ర్యాంకింగ్ ప్రొడ్యూసర్ కూడా. సైంటిఫిక్ క్రిస్టలైజర్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఈ ఉత్పత్తి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.33 లక్షలుగా మార్చి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.

స్టాక్ చరిత్ర..
శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో స్టాక్ మే 11, 2007 నాటికి కంపెనీ షేరు ధర రూ.19.70 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఈ రోజు సాయంత్రం 3.12 గంటల సమయంలో స్టాక్ రూ.643.60 దగ్గర ఉంది. అంటే.. ఈ 15 ఏళ్లలో కంపెనీ షేర్లు దాదాపు 3,220 శాతం జంప్ చేశాయి. మే 2007లో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ.33 లక్షలుగా ఉండేది. ఐదేళ్ల కిందట ఆగస్టు 4, 2017న షేర్ ధర రూ.131 దగ్గర ఉన్నప్పుడు లక్ష పెట్టుబడిపెట్టిన వ్యక్తికి ప్రస్తుతం దాదాపు రూ.5 లక్షల రిటర్న్ వచ్చేది.

మార్కెట్ ఓలటాలిటీలోను పైకే.
.
గత ఏడాది కాలంలో కూడా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను నిరాశపరచలేదు. శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో లిమిటెడ్ షేర్లు ఈ కాలంలో 89.96% రాబడిని అందించాయి. కనీసం ఏడాది కిందట లక్ష పెట్టుబడిపెట్టిన వారికి రూ.1.90 లక్షలకు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లలో ఏర్పడిన అస్థిరతి మధ్య కూడా ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 92.05% రాబడిని అందించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు గత నెల రోజుల కాల్లో 57.86% పెరిగాయి. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.669 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.274గా ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

Stock market: తిరిగి పుంజుకున్న ఐటీ షేర్లు! బుల్ రన్ ఇలాగే కొనసాగుతుందా?

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications