న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవ్వాళే ఆరంభమైంది. భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ రెండింటేనే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఇందులోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాటా అధికంగా ఉంటోంది. మూడోదశ వ్యాక్సినేషన్ కింద 18 నుంచి 44 సంవత్సరాల వరకు వయస్సున్న వారికి టీకాలను వేయాల్సి ఉంది.

మూడోదశలో ఇబ్బందులు..
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినప్పటికీ.. అది ఇంకా అందాల్సి ఉంది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించినప్పటికీ.. ప్రస్తుతం టీకాల కొరత నెలకొంది. ఏపీ తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నాయి. చాలినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వస్తోందనీ చెబుతున్నారు.

స్పుత్నిక్ వీ ఫస్ట్ బ్యాచ్
ఈ పరిణామాల మధ్య స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఫస్ట్‌బ్యాచ్ భారత్‌కు రానుంది. ఫస్ట్ షిప్‌మెంట్ ఈ సాయంత్రానికి భారత్‌కు చేరుతుందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. వచ్చే జూన్ మొదటి వారం నాటికి అయిదు మిలియన్ డోసుల వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ షిప్‌మెంట్ కింద 1,50,000 నుంచి 2,00,000 డోసులు అందొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

జూన్ మొదటి వారం నాటికి అయిదు లక్షల డోసులు
ఈ నెల చివరివారం లేదా జూన్ మొదటి వారం నాటికి మరో 3,00,000 డోసులు అందుతాయని చెబుతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐ కిందటి నెల 13వ తేదీన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మనదేశంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. గామ్-కోవిడ్-వ్యాక్ కంబైన్డ్ వ్యాక్సిన్ వెక్టార్ ఇది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఉంది.

రేటుపై తేల్చని రెడ్డీస్ ల్యాబ్స్
తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 21 రోజుల్లోనే రెండో దశ డోసు తీసుకునే వెసలుబాటు ఉంది. ఈ వ్యాక్సిన్ ధర ఎంత అనేది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇంకా నిర్ధారించలేదు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. వాటి రేట్లను ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్..నేడో రేపో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటును ప్రకటించే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications