Spotify: ఉద్యోగుల దారిలోనే 'స్పాటిఫై' CFO.. వెళ్లేముందు భారీ సెల్ అవుట్‌తో కంపెనీకి ఝలక్
CFO Depature: ఓ పక్కన వరుస లేఆఫ్స్ తో ఉద్యోగులు సతమతం అవుతున్నారు. మరోపక్క అగ్ర నాయకత్వం విషయంలో కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టాప్ లెవల్ సిబ్బంది ఆయా సంస్థలను వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల 1,500 మందికి ఉద్వాసన పలికిన సంస్థ.. ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం 'స్పాటిఫై' ఇటీవల మూడో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే CFO పాల్ వోగెల్ కంపెనీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు CEO డేనియల్ EK తెలిపారు. సంస్థ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో.. విభిన్న అనుభవాల కలయికతో కుడిన CFO అవసరం ఉందనే నిర్ణయానికి తామిద్దరం వచ్చినట్లు చెప్పారు.

ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీ శ్రామికశక్తిలో 17 శాతాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన కొద్దిసేపటికి స్పాటిఫై స్టాక్ విలువ దాదాపు 8 శాతం పెరిగింది. అయితే ఆ మరుసటి రోజే 9.3 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించడానికి CFO ముందుకొచ్చారు. మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు కూడా 1.6 మిలియన్ డాలర్ల షేర్లను క్యాష్ చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
ప్రస్తుత CFO రానున్న మార్చి 31న స్పాటిఫై నుంచి నిష్క్రమించనున్నారు. దీంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న బెన్ కుంగ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. అతి త్వరలోనే మరో కొత్త వ్యక్తి ఆ పదవిని అధిరోహిస్తారని ప్రకటించింది.


Click it and Unblock the Notifications