Boeing News: మరణించిన విజిల్‌బ్లోయర్ జాషువా డీన్.. బోయింగ్ కుంభకోణంలో మరో బలి..

Josh Dean Died: అంతర్జాతీయంగా విమానయాన సంస్థలకు బోయింత్ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. అయితే ఈ కంపెనీకి సరఫరాదారు స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌. బోయింగ్ విమానాల్లో లోపాలను గుర్తించిన స్పిరిట్ ఏరోసిస్టమ్స్ మాజీ క్వాలిటీ ఆడిటర్, విజిల్‌బ్లోయర్ జాషువా డీన్ అకస్మాత్తుగా, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. అయితే ఇది టార్గెటెడ్ కిల్లింగ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

45 ఏళ్ల డీన్ స్పిరిట్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న విచిత, కాన్ ప్రాంతంలో నివశిస్తున్నాడు. రెండు వారాల కిందట అనారోగ్యానికి గురైన తర్వాత డీన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని అత్త కరోల్ పార్సన్స్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో డీల్ మృతిపై స్పిరిట్ ఏరోసిస్టమ్స్‌ ప్రతినిధి జో బుకినో సంతాపం వ్యక్తం చేశారు. 2019లో స్పిరిట్ నాయకత్వం బోయింగ్ 737 MAX సిరీస్‌ కీలకమైన తయారీ లోపాల విషయంలను విస్మరించిందని గుర్తించారు. కంపెనీకి వ్యతిరేకంగా వాటాదారులు వేసిన దావాలో నిజాలను బయటపెట్టాడు. దీంతో కంపెనీ 2023 ఏప్రిలో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

Spirit AeroSystems Whistleblower Josh Dean Died with Lung Infection exposed Boeing Scandal

అకస్మాత్తుగా శ్వాసతీసుకోవటంలో ఇబ్బందిపడ్డ విజిల్‌బ్లోయర్ ఆసుపత్రిలో చేరినప్పుడు.. వైద్యులు ECMO, డయాలసిస్‌తో సహా వారు చేయగలిగినదంతా చేశారు. అయినప్పటికీ అతని ఆరోగ్యంలో క్షీణత కొనసాగిందని వెల్లడైంది. దీనికి ముందు మరో బోయింగ్ విజిల్‌బ్లోయర్ జాన్ 'మిచ్' బార్నెట్ మార్చిలో శవమై కనిపించాడు. ఈయన 787 డ్రీమ్‌లైనర్‌తో భద్రతా సమస్యలను బహిర్గతం చేశారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వెల్లడైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం అతడు స్వయంగా తుపాకీతో కాల్చుకుని మరణించినట్లు గుర్తించబడింది.

స్పిరిట్ నాయకత్వం బోయింగ్ 737 MAX విమానాలలో క్లిష్టమైన తయారీ లోపాలను విస్మరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో జాషువా డీన్ ఒకరు. అతను తన పరిశీలనలను డాక్యుమెంట్ చేసారు. వెనుక ప్రెజర్ బల్క్‌హెడ్‌లో సరిగ్గా డ్రిల్ చేయని రంధ్రాల గురించి తన డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. క్యాబిన్ ఒత్తిడిని నిర్వహించడానికి ఇది కీలకమైన భాగం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+