Kalanithi Maran: ఎంతోకాలంగా సాగిన ఓ కేసులో ఎట్టకేలకు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ విజయం సాధించింది. దాని మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ కు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ తన కార్యచరణ ప్రణాళికను వెల్లడించింది.
తమ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ మరన్ మరియు KAL ఎయిర్‌వేస్ నుంచి 450 కోట్ల వాపసు కోరుతున్నట్లు లో కాస్ట్ క్యారియర్ స్పైస్ జెట్ ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి తీర్పు తమకు అనుకూలంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వివరాలు వెల్లడించింది.

గతంలో మారన్ మరియు అతని సంస్థకు ఎయిర్‌లైన్ 730 కోట్లు చెల్లించింది. ఇందులో అసలు 580 కోట్లు కాగా వడ్డీ 150 కోట్లు. కేసు విషయంలో ఎదురైన అనేక క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొని కోర్టు నుంచి అనకూల తీర్పు వచ్చేందుకు స్పైస్‌జెట్ మరియు దాని ఛైర్మన్ అజయ్ సింగ్ ఎంతో కృషి చేసినట్లు తెలుస్తోంది. దీంతో నగదు వాపసు పొందడానికి మార్గం సుగమం అయినట్లు భావిస్తున్నారు.
జులై 31, 2023 నుంచి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ స్పైస్‌జెట్ పలు అప్పీళ్లను దాఖలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ రవీందర్ దూడేజాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న ఎట్టకేలకు నగదు వాపసుకు అనుమతించింది. మధ్యవర్తిత్వ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల పునఃపరిశీలన కేసు ఇప్పుడు సంబంధిత కోర్టుకు తిరిగి రావడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications