కరోనా వైరస్ దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రముఖ విమానయాన సేవల సంస్థ స్పైస్ జెట్ సరికొత్త విభాగంలోకి అడుగిడుతోంది. ఇటీవల కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల మందికి సోకినా ఈ మహమ్మారి... దాదాపు 4 లక్షల మందిని పొట్టనబొట్టుకుంది. ఇండియా లో నూ విలయతాండవం చేస్తోంది. మన దేశంలో 3.5 లక్షల మందికి సోకిన కరోనా... దాదాపు ఇక్కడ 12,000 మంది మృతికి కారణమైంది.
దీంతో ప్రజలంతా కరోనా పేరు వింటేనే వణికిపోతున్నారు. అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విమానయాన రంగం మరింత గా దెబ్బతింది. సాధారణంగానే ఏవియేషన్ రంగం సంక్షోభాలను ఎదురుకొంటుంది. ఎయిర్లైన్ సంస్థలు లాభాల కంటే నష్టాన్ని అధికంగా చవిచూస్తాయి. కరోనా వ్యాప్తి తర్వాత ఇండియా నుంచి విదేశీ ప్రయాణాలపై పూర్తిగా నిషేధం కొనసాగుతోంది.
దేశీయ సర్వీసులకు కొన్ని షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా... ఇంకా పూర్తి స్థాయిలో సర్వీసులు లభించటం లేదు. పైలెట్ల నుంచి గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది వరకు అన్ని విభాగాల్లోనూ విపరీతమైన కొరతలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ మాత్రం సరికొత్త సేవలపై దృష్టిసారిస్తోంది.

ఆరుగురికి ఒక విమానం...
ప్రస్తుతం ఇండియా లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. అత్యవసరమైతే గానీ ప్రయాణికులు జర్నీ చేయటం లేదు. పైగా ఇతరులతో కలిసి పక్క సీట్లో కూర్చుని ప్రయాణించేందుకు చాలా మంది సంకోచిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారో... తెలియదు. ఎవరిని కలిశారో తెలియదు.
కాబట్టి వాళ్ళ నుంచి కరోనా సోకె ప్రమాదం ఉంటుందని అనుకుంటున్నారు. అయిర్పోర్టుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... చాలా మంది కరోనా లక్షణాలు లేకుండానే దాని బారిన పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని, స్పైస్ జెట్ ప్రయాణికుల కోసం ఒక సరికొత్త అవకాశము కల్పిస్తోంది. కేవలం 6 సభ్యులుంటే వారికోసం ప్రత్యేకంగా ఒక విమానం నడిపేందుకు సన్నద్ధం అవుతోంది.

మొత్తం ఫ్లైట్ ...
అయితే ఈ విధానంలో కనీసం ఆరుగురు ప్రయాణికులు ఒక ఫ్లైట్ ను బుక్ చేసుకోవచ్చు. వీటిని ప్రైవేట్ జెట్ లు అని పిలుస్తారు. ఒకే కుటుంబానికి చెందిన వారు, లేదా కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల కోసం వీటిని ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు. అప్పుడు తెలియని వారితో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. భౌతిక దూరం సహా ఇతర కరోనా ముందు జాగ్రత్త చర్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందుకోసం స్పైస్ జెట్ 6 సీట్ల నుంచి 212 సీట్ల వరకు ఉండే విమానాలను ప్రయాణికుల కోసం సిద్ధం చేస్తోంది.
దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సమయం కూడా ముందుగానే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సేవలు కూడా దేశీయంగా మాత్రమే లభిస్తాయి. కానీ సాధారణ విమానాల్లో ప్రయాణించే బదులు వీటిల్లో అయితే కాస్త ఇబ్బంది లేకుండా, కేవలం తెలిసిన వారితో ప్రయాణించే సౌకర్యం లభిస్తుంది.

ఖర్చు ఎక్కువే...
సౌకర్యాలు పెరిగితే సహజంగానే ధరలు కూడా పెరుగుతాయి. అలాగే స్పైస్ జెట్ అందించే స్పెషల్ ఫ్లైట్స్ కూడా ఖరీదు ఎక్కువే ఉంటాయి. వీటిని ముందస్తుగానే బుక్ చేసుకోవాలి. ఎంత మంది ప్రయాణికుల కోసం ఒక ఫ్లైట్ బుక్ చేస్తున్నారో.. ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లాలో తెలియజేయాల్సి ఉంటుంది. పాసెంజర్ల అవసరాలకు అనుగుణంగా, ఫ్లైట్స్ అందుబాటులో ఉంటె వెంటనే స్పైస్ జెట్ నుంచి ఒక ప్రైవేట్ జెట్ బుక్ అవుతుంది.
ఇక మీరు ఎంచక్కా బాగ్ సర్దుకుని, ఎయిర్పోర్ట్ కు వెళితే చాలు. మిగితా ప్రక్రియ మొత్తం స్పైస్ జెట్ సిబ్బంది దగ్గర ఉండి మరీ పూర్తిచేస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు ప్రైవేట్ జెట్ సేవలు అందించటానికి అనేక ప్రైవేట్ జెట్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఒక పౌర విమానయాన రంగ సంస్థ నేరుగా ప్రైవేట్ జెట్ల సేవలను అందించటం బహుశా ఇదే తొలిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications