Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్స్ తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడులను అందిస్తుంటాయి. అనేక రెట్లు రాబడులను అందిస్తుంటాయి. ఈ స్టాక్ కూడా ఆ కోవకు చెందినదే. స్పెషాలిటీ కెమికల్ కంపెనీ యశో ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వాటాదారులకు రెండేళ్లలో 10 రెట్లు రిటర్న్స్ అందించింది. ఈ కాలంలో కంపెనీ షేరు ధర 10 రెట్లు పెరిగింది.
కంపెనీ షేరు ధర 29 జూన్ 2020న రూ.118.80 నుంచి 28 జూన్ 2022న రూ.1378.90కి పెరిగింది. కంపెనీ రబ్బరు, రబ్బరు పాలు, ఆహారం, పెర్ఫ్యూమ్ వంటి పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను తయారు చేస్తుంది. ఇది స్పెషాలిటీ కెమికల్స్ లో మంచి గుర్తింపును పొందింది. గడచిన రెండు సంవత్సరాలుగా కెమికల్ కంపెనీలకు మంచి కాలమని చెప్పుకోవాలి.

గ్రోత్ ఫేజ్ లో కెమికల్ కంపెనీలు..
వెనక్కి తిరిగి చూసుకుంటే గత రెండేళ్లుగా కెమికల్ కంపెనీలకు ఎంతో మేలు జరిగింది. చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ కంపెనీలు ఇప్పుడు పెట్టుబడిదారులకు ఇష్టమైనవిగా మారాయి. చైనా ప్లస్ వన్ వ్యూహం, బలమైన దేశీయ డిమాండ్, సముచిత ఉత్పత్తుల కోసం గ్లోబల్ కస్టమర్ల నుంచి డిమాండ్,ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ చొరవ కారణంగా ఈ రంగానికి చాలా మంచి జరిగింది.

రెండేళ్లలో కంపెనీ ఆదాయాలు రెట్టింపు..
అద్భుతమైన ఆర్థిక పనితీరుతో కారణంగా కంపెనీ షేరు ధర పెరిగింది. కంపెనీ ఆదాయం గత రెండేళ్లలో రెండింతలు పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2020లో రూ.300 కోట్ల నుంచి ఆదాయం 2022లో రూ.624 కోట్లకు పెరిగింది. PBIDT కేవలం రెండేళ్లలో 42.9 కోట్ల రూపాయల నుంచి 103.7 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది దాదాపు 2.5 రెట్లు పెరుగుదల. అలాగే కంపెనీ బాటమ్ లైన్ 4.3 రెట్లు పెరిగి రూ.12.04 కోట్ల నుంచి రూ.52.73 కోట్లకు చేరింది.

ప్రస్తుతం షేర్ ధర ఇలా..
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి యశో ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు గత ముగింపు ధరతో పోలిస్తే 2.27% పెరుగుదలతో రూ.1378.90 వద్ద ఉంది. షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.2,099 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.418.55గా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications