Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. ముంబై, విశాఖపట్నానికి ప్రత్యేక రైళ్లు..!

త్వరలో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద నగరాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, బెంగళూరు-ముంబై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. అంతే కాదు విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. రైలు నంబర్ 01013 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు ప్రతి శనివారం అర్ధరాత్రి 12:35 గంటలకు CSMT ముంబై నుంచి బయలుదేరి, దాదాపు 24 గంటల ప్రయాణం తర్వాత రాత్రి 11:55 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 01014, అక్టోబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు ప్రతి ఆదివారం ఉదయం 4:30 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, ఉదయం 4:05 గంటలకు CSMT ముంబైకి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు ప్రతి దిశలోనూ ఏడు సార్లు ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, లోనంద్, సతారా, కరాడ్, సాంగ్లీ, మిరాజ్, కుడాచి, రాయ్‌బాగ్, ఘటప్రభ, బెళగావి, లోండా, ధార్వాడ్, హుబ్బళ్లి, హవేరి, రాణిబెన్నూర్, హరిహర్, దావణగెరె, బిరూర్, అరసికెరె, తుమకూరు మీదుగా నడుస్తాయి.

Train

రైలు నంబర్ 08583, అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:50 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారపేట, కేఆర్ పురం మీదుగా నడుస్తాయి.

ఇటు తెలంగాణ ఏపీ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దసరా పండగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ప్రత్యేక రైళ్లకు సంబంధించి త్వరలోనే అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయనున్నామని, రైల్వేల్లో ప్రయాణం వేగంగా, సురక్షితమైనదని భావించి అందరూ రైళ్లలోనే ప్రయాణించాలని దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+