Saturday Trading: ట్రేడర్స్‌కు బిగ్ అలర్ట్.. రేపు పనిచేయనున్న స్టాక్‌ మార్కెట్లు.. ఇవీ టైమింగ్స్

Stock Market News: సాధారణంగా స్టాక్ మార్కెట్లు సెలవు రోజులు మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు పనిచేస్తాయి. అయితే ఆరో రోజైన శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించేందుకు ఎక్స్ఛేంజ్‌లు రెడీ అయ్యాయి. ఇందుకు కారణం ఏమిటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎప్పుడూ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా స్టాక్ మార్కెట్లలో నిర్ణయాలు ఉంటాయి. అయితే ఈసారి కొంత భిన్నంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు డిపాజిటరీల కోసం రేపు ఓ ఈవెంట్ జరగబోతోంది. బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ (BCP) మరియు డిజాస్టర్ రికవరీ సైట్ (DRS) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా NSE, BSEల్లో ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు.

Special live trading session in both NSE and BSE tomorrow

ఇందుకోసం మార్చి 2 శనివారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలు NSE మరియు BSE కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కావున మార్కెట్లకు సెలవు లేదు. అయితే ఇది కేవలం ఒకసారి నిర్ణయం మాత్రమేనని గుమనించాల్సి ఉంటుంది. సిస్టమ్‌లో ఏదైనా ఊహించని విపత్తు సంభవించినప్పుడు ఎక్స్ఛేంజీల సంసిద్ధతను పరీక్షించడం ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ముఖ్య ఉద్దేశం.

ఈక్విటీ మరియు ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌కి ఇంట్రా-డే స్విచ్ ఓవర్‌తో ఎక్స్ఛేంజ్ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ నిర్వహిస్తున్నట్లు NSE పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 14నాటి తన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ ట్రేడింగ్ సెషన్‌లు ఉదయం 9:15 నుంచి 10 వరకు మరియు 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. F&O సెక్యూరిటీల అప్పర్ మరియు లోయర్ బ్యాండ్‌లు 5 శాతమని గమనించాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+