Infosys: ఇన్ఫోసిస్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏఐ ఏం చేయలేదన్న నందన్ నీలేకని..!

ప్రస్తుతం ప్రపంచం అంతా ఏఐపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ఏఐ టెక్నాలజీలో చాలా ముందున్నాయి. ఏఐ విప్లవంతో భారత సంప్రదాయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో దేశ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, విప్రో షేర్లు గత కొంత కాలంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. అయితే ఏఐపై తాజాగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందించారు. సంప్రదాయ ఐటీ సేవలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ తీస్తుందన్న అభిప్రాయాలను ఆయన కొట్టి పారేశారు.

ఏఐ సాంకేతికత వేగంగా మారే కంపెనీలను భర్తీ చేయదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఇన్ఫోసిస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ పటిష్ట స్థితిలోనే ఉందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ కంపెనీని భర్తీ చేయదని స్పష్టం చేశారు. ఇండియాలో 300 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంగా వెన్నుముకగా ఉన్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలను ఏఐ భర్తీ చేస్తుందా అని పెట్టుబడిదారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

Infosys

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు గతంతో పోలిస్తే ఇపుడు మరింత ప్రాధాన్య సంస్థగా ఇన్పోసిస్‌ ఎదిగిందని తెలిపారు. 2030 కల్లా 300-400 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.28.5 నుంచి 38 లక్షల కోట్ల ఏఐ అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మార్జిన్లు, వృద్ధిపై సందేహాలు తలెత్తుతాయని తెలిపారు. ప్రస్తుతం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో భారీ తేడా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు. ఏఏఐతో కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇన్ఫోసిస్ అవసరం ఏముంటుందని అగుడుతున్నారని గుర్తు చేశారు.

జెన్ఏఐ వచ్చి మూడేళ్లైనా ఇన్ఫోసిస్ పై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. వచ్చే 10 ఏళ్లలో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. పెద్ద కంపెనీలు ఏఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డాయనే వ్యాఖ్యలు వాస్తవం అయినప్పటికీ.. ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలను ఏఐ భర్తీ చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. ఏఐ, డేటా, ప్రాసెస్‌ ఎఫిషియన్సీ, టెక్నాలజీ మోడర్నైజేషన్, ఫిజికల్‌ ఏఐ ఏఐ ట్రస్ట్‌-సెక్యూరిటీ లాంటిపై వైపు క్లయింట్లు దృష్టి పెడుతున్నారని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ చెప్పారు. 2025-26 కంపెనీలో 20 వేల మంది ప్రెషర్లను తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో 3 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నట్లు వివరించారు. ఈ సంవత్సరం కూడా ఉద్యోగుల భర్తీ కొనసాగుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+