నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో గూగుల్ వంటి పలు దిగ్గజ కంపెనీలు విచారణను ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫేస్‌బుక్ కూడా వచ్చి చేరింది. ప్రస్తుతానికి ఓ దేశమే గొంతెత్తినా, రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఫేస్‌బుక్ బాస్ మెటాకు గట్టి షాక్ తగిలింది. స్పానిష్ మీడియా ఏకంగా 5 వేల కోట్ల మేర దావా వేసింది. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ అంతటా ఇదే చర్య పునరావృతం కావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో అనైతిక పోటీతత్వం విషయమై ఈ దుమారం చెలరేగినట్లు తెలుస్తోంది.

స్పెయిన్‌కు చెందిన 83 మీడియా అవుట్‌లెట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సమూహం.. ఫేస్‌బుక్ యజమాన్యం చర్యలను ఖండించింది. 2018-2023 మధ్య EU డేటా ప్రొటెక్షన్ నియమాలను మెటా ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ కమర్షియల్ కోర్టులో వార్తాపత్రికలు సమిష్టిగా దావా వేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను.. మెటా మితిమీరి ఉపయోగించినట్లు స్పానిష్ మీడియా సంస్థలు ఆరోపించాయి. ఈ సమాచారం ఆధారంగా పర్సనల్ యూడ్స్ రూపొందించి, అన్యాయంగా ప్రయోజనాలను పొందినట్లు వాదించాయి. అయితే ఇప్పటివరకు దీనిపై తమకు లీగన్ నోటీసులేవీ అందలేదని మెటా వర్గాలు వెల్లడించాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications