అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత ఏడాది ఇండియాలోకి ఎంట్రీ పై నిరణయాన్ని విరమించుకున్న తర్వాత తాజాగా దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనే లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ముంబైలో మొదటి షోరూమ్‌ను ప్రారంభించేందుకు లీజు అగ్రిమెంట్ పై సంతకం చేసిందని రిజిస్ట్రేషన్ పేపర్స్ వెల్లడిస్తున్నాయి. టెస్లా కంపెనీ 16 ఫిబ్రవరి 2025 నుండి ఐదు సంవత్సరాల పాటు లీజుకు సంతకం చేసిందని, దాదాపు బాస్కెట్‌బాల్ కోర్టు సైజులో ఉన్న ఈ 4,003 చదరపు అడుగుల (372 చదరపు మీటర్లు) స్థలానికి మొదటి సంవత్సరం దాదాపు $446,000 అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి టెస్లా ఎ విధంగా స్పందించలేదు.
సమాచారం ప్రకారం, ముంబై నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని బిజినెస్ అండ్ రిటైల్ హబ్ మాక్సిటీ భవనంలో ఈ షోరూమ్ ఉంటుంది. కార్ల తయారీ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన కొన్ని రోజుల తర్వాత టెస్లా భారతదేశంలోని న్యూఢిల్లీ ఇంకా ముంబై నగరాల్లో రెండు షోరూమ్‌ల కోసం ప్రదేశం సెలెక్ట్ చేసినట్లు రాయిటర్స్ గత నెలలో నివేదించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గించిన తర్వాత టెస్లా భారతదేశంలోకి రాబోతుంది.

అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ రాయిటర్స్‌కు అందించిన రిజిస్టర్డ్ లీజు పేపర్ ప్రకారం, అద్దె ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది, ఐదవ సంవత్సరానికి ఈ రెంట్ దాదాపు $542,000కి చేరుకుంటుందని అంచనా. అయితే ఈ షోరూమ్‌కు ప్రతినేల అద్దె దాదాపు 35 లక్షల రూపాయలు అని తెలుస్తుంది. టెస్లా ముంబై తర్వాత ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో రెండవ షోరూమ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. టెస్లా తొలి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించనున్న నేపథ్యంలో కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీని కూడా తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో సంవత్సరానికి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంపై టెస్లా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఎలోన్ మస్క్ వేసిన టెస్లా ప్లాన్ ఫలిస్తే ఈ కంపెనీ భారతదేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించే అవకాశం ఉంది. ఈ కార్ల ధర కనీసం రూ.30 లక్షల నుండి రూ.40 లక్షలు మధ్య ఉంటుందని అంచనా. భారతదేశంలో కార్లు తయారు చేస్తే సముద్ర మార్గం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వాటిని ఎగుమతి చేయడం సులభం అవుతుంది. అందుకే టెస్లా ఇండియాలో ప్లాంట్ ప్రారంభించేందుకు ఇండియాని ఎందుకున్నట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications