ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టును దేశీయ దిగ్గజ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ పార్లమెంటు బిడ్‌ను పొందే క్రమంలో టాటా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్(SP) ఇటీవల ఆరోపించింది. అయితే తాజాగా, ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో SP గ్రూప్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల విభాగంకు (CPWD) SP గ్రూప్ లేఖ రాసింది. ఇక మీదట పార్లమెంటు భవనం కాంట్రాక్టుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయమని స్పష్టం చేసింది. ఈ అంశంపై మీ ఆఫీస్ అంతర్గత సమీక్షను చేపట్టిందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా చర్చించి విశ్లేషించిందని అందుకు అభినందిస్తున్నామని పేర్కొంది. మొత్తం బిడ్డింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగినట్లు వెల్లడించినందుకు అభినందిస్తున్నట్లు తెలిపింది.

ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనానికి సమీపంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చుకునేందుకు కొత్త భవనం ఉండనుంది. దాదాపు రూ.860 కోట్లతో సెంట్రల్ విస్తా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా 22 నెలల వ్యవధిలో పార్లమెంట్ భవనాన్ని పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications