టాటా సన్స్‌తో తెగదెంపులకు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్(SP గ్రూప్) సిద్ధమని తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టుకు ఎస్పీ గ్రూప్ తెలిపింది. టాటా సన్స్ కూడా ఈ వాటాలను మార్కెట్ రేట్ వద్ద కొనుగోలు చేసేందుకు సై అన్నది. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన ఈ గ్రూప్‌కు 18.4 శాతం వరకు వాటా ఉంది.
ఈ వాటాలను టాటా సన్స్ కొనుగోలు చేస్తే ఎస్పీ గ్రూప్‌కు భారీగా నిధులు సమకూరుతాయి. రూ.1 లక్ష కోట్లకు పైగా వస్తాయని అంచనా. ఇటీవల షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌పై రుణభారం పెరిగింది. టాటా సన్స్‌లో వాటాల విక్రయంతో రుణభారం తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 23, బుధవారం) ఎస్పీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

ఎగిసిపడిన ఎస్పీ గ్రూప్ కంపెనీ షేర్లు
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలు స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్, ఫోర్బ్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం గం.2 సమయానికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ గ్రూప్ షేర్ ధర ఏకంగా 20 శాతం పెరిగి రూ.235 పలికింది. 2019 ఆగస్ట్ తర్వాత బిగ్గెస్ట్ సింగిల్ డే లాభాలు ఇదే కావడం గమనార్హం.
ఇక ఫోర్బ్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర 5 శాతం ఎగిసి రూ.1,485 వద్ద ట్రేడ్ అయింది.
స్టెర్లింగ్ అండ్ విల్సన్ గ్రూప్‌లో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు 50.6 శాతం వాటాలు ఉండగా, ఫోర్బ్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ గ్రూప్‌లో 72.6 శాతం వాటాలు ఉన్నాయి.

షేర్ ధరలు ఎందుకు పెరిగాయ్
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీల షేర్లు ఈ రోజు ఎగిసిపడుతున్నాయి. ఇందుకు కారణం ఉంది. ఈ కంపెనీకి రుణభారం ఉంది. టాటా సన్స్ వాటాల విక్రయం ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవడానికి షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు వెసులుబాటు దొరుకుతుంది.
ఇప్పటికే స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌కు చెందిన రుణాలు చెల్లించవచ్చు. గతవారం ఎస్పీ గ్రూప్.. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడువు పూర్తయింది. ఇలాంటి రుణాల చెల్లింపుకు ఉపయోగపడుతుంది. వెయ్యి కోట్ల రుణాలకు గాను రూ.103 కోట్లు చెల్లించింది. ప్రమోటర్లు మిగతా డెబిట్స్‌ను సెప్టెంబర్ 2021 నాటికి చెల్లించాలి.

ఆర్డర్స్ వ్యాల్యూ
జూన్ నాటికి స్టెర్లింగ్ అండ్ విల్సన్‌లో ఎస్పీ గ్రూప్ వాటా 50.6 శాతంగా ఉంది. కంపెనీ ఆర్డర్ బుక్ వ్యాల్యూ రూ.5,696 కోట్లను తాకింది. ఈఏడాది ఏప్రిల్-జూన్ కాలంలోనే 1 గిగావాట్ ఆర్డర్స్ దక్కించుకుంది. వీటి వ్యాల్యూ రూ.3,633 కోట్లు. కొనుగోళ్లు పెరిగి, అమ్మేవారు లేకపోవడంతో షేర్ ధర పెరిగింది.


Click it and Unblock the Notifications